చెల్లి చికిత్స కోసం ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ కారుకు  అడ్డుపడిన అక్క

చెల్లి చికిత్స కోసం ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ కారుకు  అడ్డుపడిన అక్క
  • లాగి పడేసిన పోలీసులు.. డెంగీతో చెల్లి మృతి
  • ఉత్తరప్రదేశ్‌‌‌‌లో డెంగీకి 60 మంది చిన్నారులు బలి 

లక్నో: చెల్లికి సరైన ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ అందించి కాపాడాలని ఆ అక్క ప్రాధేయపడింది. ఇన్‌‌‌‌స్పెక్షన్‌‌‌‌కు వచ్చిన ఆఫీసర్ కారుకు అడ్డుపడి మరీ బతిలాడింది. ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని కారుకు అడ్డుగా కూర్చుంది. దీంతో ఆమెను పోలీసులు పక్కకు లాగి పడేశారు. ఇంత చేసినా పాపం చెల్లిని మాత్రం ఆమె కాపాడుకోలేక పోయింది. డెంగీతో పోరాడుతూ 11 ఏండ్ల వైష్ణవి కుష్వాహ మరణించింది. ఈ దారుణ ఘటన లక్నో ఫిరోజాబాద్‌‌‌‌లోని గవర్నమెంట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌లో సోమవారం సాయంత్రం జరిగింది. డెంగీతో బాధపడుతున్న వైష్ణవిని ఫిరోజాబాద్‌‌‌‌లోని గవర్నమెంట్ హాస్పిటల్‌‌‌‌లో అడ్మిట్ చేశారు. తన చెల్లికి సరైన ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇచ్చి కాపాడాలని హాస్పిటల్‌‌‌‌ ఇన్‌‌‌‌స్పెక్షన్‌‌‌‌కు వచ్చిన ఆగ్రా డివిజనల్ కమిషనర్‌‌‌‌‌‌‌‌ అమిత్‌‌‌‌ గుప్తా కారుకు అక్క నికిత కుష్వాహ అడ్డుపడింది. ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇచ్చే వరకు వెళ్లనిచ్చేది లేదని తేల్చి చెప్పింది. హాస్పిటల్‌‌‌‌లో సరైన సౌలతులు లేవని ఆరోపించింది. దీంతో అక్కడే ఉన్న మహిళా పోలీసులు ఆమెను పక్కకు లాగి పడేశారు.

కమిషనర్‌‌‌‌‌‌‌‌, మరో పోలీసు నికితకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు వీడియోలో కనిపించింది. ఇది జరిగిన కొన్ని గంటల తరువాత వైష్ణవి మరణించింది. తన చెల్లికి హాస్పిటల్‌‌‌‌లో సరైన ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ అందలేదని నికిత ఆరోపించింది. డాక్టర్లను సస్పెండ్‌‌‌‌ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా, వైష్ణవిని కాపాడడానికి అన్ని విధాలుగా ప్రయత్నించామని ఫిరోజాబాద్‌‌‌‌ మెడికల్‌‌‌‌ కాలేజ్‌‌‌‌ ప్రిన్సిపాల్‌‌‌‌ డాక్టర్ సంగీత అనేజా చెప్పారు. ‘‘వైష్ణవిది చాలా క్లిష్టమైన పరిస్థితి. లివర్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌లార్జ్ అయ్యింది. పొత్తి కడుపులో లిక్విడ్‌‌‌‌ చేరింది. వెంటిలేటర్‌‌‌‌‌‌‌‌పై ఉంచి ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇచ్చాం. మేం చెయ్యగలిగినంత చేశాం. కానీ ఆమెను కాపాడలేకపోయాం’’ అని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌‌‌‌ లక్నోలోని ఫిరోజాబాద్‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌లో డెంగీతో సోమవారం వరకు సుమారు 60 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.