మహబూబాబాద్ జిల్లా: తొర్రూరు పట్టణ కేంద్రంలో కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హానుమండ్ల ఝాన్సి రెడ్డి లు విచ్చేశారు. షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన వేదిక పైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. వేదిక పైకి ఎక్కువ మంది ఎక్కడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి హనుమండ్ల ఝాన్సీ కాలుకు గాయాలైయ్యాయి. వెంటనే కార్యకర్తలు, అనుచరులు ఆమెను పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.