కరోనా సోకిన మహిళ ధీన గాథ

V6 Velugu Posted on Apr 10, 2021

కరోనా మనుషుల జీవితాలను మార్చేయడం ఏమో గానీ..మనుషుల్లో మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. కరోనా వచ్చిన వారిని పూర్తిగా అంటరాని  వారీగా చూస్తున్నారు. ఇంట్లోకి కూడా రానివ్వడం లేదు.  అద్దెకుంటున్న వారి పరిస్థితి మరీ దారుణం. కరోనా వచ్చిందని ఇంటి యజమానులు ఇంట్లోకి  రానివ్వడం లేదు. ఇలాంటి ఘటనలు కరోనా వచ్చిన నుంచి చాలా చూశాం... లేటెస్ట్ గా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణం అంబేడ్కర్ కాలనీలో ఓ మహిళకు కరోనా వచ్చిందని ఇంట్లోకి రానివ్వలేదు ఆ ఇంటి యజమానులు. ఎక్కడుండాలో తెలియక ఆ మహిళ రోజంతా పాత వ్యవసాయ మార్కెట్లో జాగారం చేసింది. అక్కడి నుంచి వ్యవసాయ అధికారులు ఆమెను పంపించేశారు. అంబేడ్కర్ చౌరస్తలో సులబ్ కాంప్లెక్స్ ముందు నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ మహిళను కాంగ్రెస్ నాయకులు మొలుగు దిలీప్  గుర్తించి వైద్యాధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న వైద్య సిబ్బంది ఆ మహిళను అంబులెన్సులో కరీంనగర్ ఐసోలేషన్ సెంటర్ కు తరలించారు.

Tagged Karimnagar, woman, corona, House, Owner, jammikunta

Latest Videos

Subscribe Now

More News