వారం రోజులుగా నీళ్లు రావట్లేదని పంచాయతీ ఆఫీసుకు తాళం వేసి నిరసన

వారం రోజులుగా నీళ్లు రావట్లేదని పంచాయతీ ఆఫీసుకు తాళం వేసి నిరసన

మాచారెడ్డి(కామారెడ్డి), వెలుగు: వారం రోజులుగా సరిపడా నల్లా నీళ్లు రావడం లేదని గురువారం మధ్యాహ్నం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో కొందరు మహిళలు ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిబ్బందిని బయటికి పంపించి స్థానిక పంచాయతీ ఆఫీసుకు తాళం వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నీటి సమస్యను సర్పంచ్​లలిత దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. స్ట్రీట్​లైట్లు సరిగ్గా వెలగడం లేదని, డ్రైనేజీ సమస్య ఉందని వాపోయారు. పంచాయతీ ఆఫీసుకు తాళం వేసినా ఆఫీసర్లు ఎవరూ స్పందించకపోవడంతో ఖాళీ బిందెలతో మహిళలు రాస్తారోకో చేపట్టారు. పోలీసులు అక్కడికి చేరుకుని సంబంధిత ఆఫీసర్లతో మాట్లాడి పరిష్కరించేలా కృషి చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.