కొవిడ్ జాగ్రత్తలను పాటించాల్సిందే: WHO

కొవిడ్ జాగ్రత్తలను పాటించాల్సిందే: WHO

బెర్లిన్: కరోనాను లైట్ తీసుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియోస్ అన్నారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో నిర్వహించిన వరల్డ్ హెల్త్ సమ్మిట్‌‌లో పాల్గొన్న గెబ్రియోస్.. కరోనా మహమ్మారి కథ ఇంకా ముగియలేదని హెచ్చరించారు. ప్రజలు హెల్త్ ప్రొటోకాల్స్‌ను తప్పకుండా పాటించాలని సూచించారు. 

‘మహమ్మారి ఎప్పుడు అంతమవ్వాలనేది ప్రపంచం చేతుల్లో ఉంది. వైరస్‌ను ఎదుర్కొనేందుకు కావాల్సివన్నీ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. కరోనాను తేలిగ్గా తీసుకోవద్దు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వారానికి 50 వేల కొవిడ్ మరణాలు నమోదవుతన్నాయి. ఇవి కేవలం అధికారిక లెక్కలే. కరోనా ముగియడానికి చాలా కాలం పట్టొచ్చు. ఈ ఏడాది ఆఖరుకు ప్రతి దేశంలో 40 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది చేరుకోదగ్గ టార్గెట్. టీకా తయారీ కంపెనీలు, వ్యాక్సిన్‌ను కంట్రోల్ చేస్తున్న దేశాలు సహకరిస్తేనే ఇది సాధ్యమవుతుంది’ అని అధనోమ్ చెప్పారు. ప్రైమరీ హెల్త్ కేర్‌ మెరుగుదల కోసం ఆరోగ్య రంగంలో ఇన్వెస్ట్‌మెంట్‌ను పెంచడంపై అన్ని దేశాలు దృష్టి సారించాలని కోరారు. 

మరిన్ని వార్తల కోసం: 

పత్తి ధరకు రెక్కలు: ఎన్నడూ లేనంతగా మద్దతు ధర

క్రికెట్‌ను అవమానించిన వారితో మాట్లాడటం వేస్ట్: భజ్జీ

కెప్టెన్ నా సోల్‌మేట్.. మేం ప్రేమికులం కాదు