పాక్ మాజీ బౌలర్‌కు హర్భజన్ స్ట్రాంగ్ కౌంటర్ 

పాక్ మాజీ బౌలర్‌కు హర్భజన్ స్ట్రాంగ్ కౌంటర్ 

టీ20 వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ముగిసింది. కానీ వివాదాలు, ఇరు దేశాల మాజీ ప్లేయర్ల మధ్య డైలాగ్ వార్ నడుస్తూనే ఉన్నాయి. టీమిండియా సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, పాక్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్‌లు ట్విట్టర్‌లో ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుంటున్నారు. సూపర్ 12 దశలో భారత్‌పై పాక్ గెలవడంతో మహ్మద్ ఆమిర్ ఓ పాత వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. అందులో భజ్జీ బౌలింగ్‌లో షాహిద్ అఫ్రిది వరుస సిక్సర్లు కొట్టాడు. దీంతో హర్భజన్ అతడికి దీటుగా బదులిచ్చాడు. 

2010లో ఇంగ్లండ్, పాక్ మధ్య జరిగిన టెస్టులో ఆమిర్ వేసిన నో బాల్ క్లిప్పింగ్‌ను భజ్జీ పోస్ట్ చేశాడు. క్రికెట్‌ను అవమానించి, ప్రజలను ఫూల్స్ చేసిన నీలాంటి వారితో మాట్లాడుతున్నందుకు బాధగా ఉందని ఆమిర్‌కు కౌంటర్ ఇచ్చాడు.

అలాగే ఆమిర్ బౌలింగ్‌లో తాను సిక్సర్ బాది భారత్‌ను గెలిపించిన వీడియోను హర్భజన్ పోస్ట్ చేశాడు. కాగా, ఇంగ్లండ్‌తో జరిగిన అప్పటి సిరీస్‌లో మహ్మద్ ఆమిర్‌తోపాటు మహ్మద్ అసిఫ్, సల్మాన్ భట్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలింది. దీంతో ఆమిర్‌పై వేటు వేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. 2016లో మళ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడేందుకు అతడికి చాన్స్ ఇచ్చింది. కానీ గతేడాది అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. 

మరిన్ని వార్తల కోసం: 

అమ్మో ఒకటో తారీఖు.. భయపడుతున్న ఆర్థికశాఖ

కెప్టెన్ నా సోల్‌మేట్.. మేం ప్రేమికులం కాదు

మ్యాచ్ మధ్యలో పాక్ ప్లేయర్ నమాజ్‌.. వకార్ వ్యాఖ్యలపై వివాదం