నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ఆయా షేర్ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ఆగస్టు 6న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ అప్డేట్తో సినిమాపై నెలకొన్న ఆసక్తి మరింత పెరిగింది. 1 నిమిషం 35 సెకన్ల నిడివి గల ఈ టీజర్లో సినిమా వరల్డ్‌తో పాటు కథలోని ఎమోషనల్ ఇంటెన్సిటీని చూపించబోతున్నట్టు తెలియజేశారు.
ఈ చిత్రంలో మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు, కయాదు లోహర్, తనికెళ్ల భరణి, సోనాలి కులకర్ణి కీలకపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్టు 21న సినిమా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించగా, ఆ డేట్‌కు వచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. టీజర్‌తోపాటు కొత్త రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేసే చాన్స్ ఉంది. పాన్ వరల్డ్ గా రూపొందుతున్న ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.
