అసోంలో నీటమునిగిన వేలాది గ్రామాలు

అసోంలో నీటమునిగిన వేలాది గ్రామాలు

అసోం ప్రజలను వరద కష్టాలు వీడటం లేదు. వేల గ్రామాలు ఇంకా నీటిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. గత రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలకు అక్కడ జనం అవస్థలు పడుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 186 మంది చనిపోయారు. దాదాపు 9లక్షల మంది వరదలతో నష్టపోయారు. వేలాది మంది ఇప్పటికీ పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. మరోవైపు అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి. ఆహారం, మంచినీరు దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు. వీధుల నిండా నీరు ఉండటంతో నిత్యావసరాలు తెచ్చుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.