ఎక్కడ నుంచి పోటీ చేయాలో ప్రజలు నిర్ణయిస్తారు..బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఎక్కడ  నుంచి పోటీ చేయాలో ప్రజలు నిర్ణయిస్తారు..బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కాగజ్ నగర్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారని, రానున్న రోజుల్లో ఈ విషయం పై క్లారిటీ వస్తుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం కాగజ్ నగర్ మండలంలోని అంకుసాబుద్ధ విహార్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బుద్ధుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. పూర్ గ్రామంలో కొత్తగా నిర్మించిన త్రిరత్న  బుద్ధ విహార్ ను ఆయన ప్రారంభించారు. 

అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. ఎవరినీ చందా అడగకుండా గ్రామస్థులు బుద్ధ విహార్ నిర్మించడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులకు, అంబేడ్కర్ వాదులకు అంకూసాపూర్ ప్రజలు ఆదర్శమని అన్నారు.  రిజర్వేషన్ ల వల్ల మారుమూల గ్రామానికి చెందిన డోంగ్రి రేవయన రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకుని ఐఏఎస్ అయ్యాడని  గుర్తు చేశారు. ఆయనతో పాటు బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సిడం గణపతి, జిల్లా అధ్యక్షుడు గణపతి, అసెంబ్లీ ఇన్​ చార్జి అర్షద్​ హుస్సేన్, నాయకులు సంతోష్, ప్రవీణ్, మారుతి తదితరులు పాల్గొన్నారు..