వరుస ఎన్నికల్లో పడిపోతున్నటీఆర్ఎస్ ఓట్ల పర్సంటేజ్

వరుస ఎన్నికల్లో పడిపోతున్నటీఆర్ఎస్ ఓట్ల పర్సంటేజ్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ అంతకంతకు పడిపోతుండగా, బీజేపీ అంతే స్థాయిలో పుంజుకుంటోంది. పట్టణాలకే పరిమితమైందనే మాటలను చెరిపేస్తూ పల్లె జనాలనూ కాషాయ పార్టీ చేరుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి వరుసగా రెండోసారి అధికారం దక్కించుకున్న టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు ఆ సంతోషం ఆర్నెల్లు కూడా నిలవలేదు. లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ‘సారు కారు పదహారు’ నినాదం తారుమారైంది. అప్పటి నుంచి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. దుబ్బాక బైపోల్, జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పవర్ చూపెట్టింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినా.. గట్టి పోటీనిచ్చింది. ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచుకోగలిగింది. తాజాగా హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌నూ కైవసం చేసుకున్న కాషాయ పార్టీ.. అసెంబ్లీలో బలాన్ని మూడుకు పెంచుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్​లో బీజేపీకి ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా లేకపోగా.. ఇప్పుడు 51.96 శాతానికి ఎగబాకింది. అదే టీఆర్ఎస్ విషయానికొస్తే 59.34 ఓట్ల శాతం నుంచి 40.38 శాతానికి పడిపోయింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ మాత్రం వరుసగా జరుగుతున్న ఏ ఎన్నికలోనూ కనీసం ప్రభావం చూపలేపోతోంది.

టీఆర్ఎస్ కంప్లీట్ డౌన్

వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో ఫలితాలను చూస్తే టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతున్నదని స్పష్టమవుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ 88 సీట్లతో తిరుగులేని విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా గులాబీ పార్టీకి 46.87 శాతం ఓట్లు పడ్డాయి. అయితే తర్వాత జరిగిన ఏ ఎన్నికలోనూ అధికార పార్టీకి ఓట్లు పెరగలేదు. 2019 లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ బొక్కబోర్లా పడింది. 17 ఎంపీ సీట్లలో కేవలం 9 మాత్రమే గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో పార్టీ ఓట్ల శాతం 41.29కి పడిపోయింది. ఇక సోలిపేట రామలింగారెడ్డి మరణంతో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో గులాబీ పార్టీ మరింత దిగజారింది. 2018లో టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు 54.36 శాతం ఓట్లు రాగా.. 2020 ఉప ఎన్నికలో 37.82 శాతానికి పడిపోయింది. జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ ఎన్నికల్లో 35.77 శాతం ఓట్లే వచ్చాయి. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి. మొదటి ప్రాధాన్య ఓట్ల ప్రకారం చూస్తే రెండు స్థానాలు కలిపి 31.7% ఓట్లు మాత్రమే టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు వచ్చాయి. ఈ ఏడాది మొదట్లో జరిగిన నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్​లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నడిచింది. ఈ ఎన్నికల్లో 3% ఓట్లను అధికార పార్టీ పెంచుకుంది.

కాంగ్రెస్ గల్లంతు

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్.. ఓట్ల శాతాన్ని అంతకంతకూ కోల్పోతోంది. ప్రతి ఎన్నికలోనూ చతికిలపడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 28.43% ఓట్లు, లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎలక్షన్లలో 29.48%ఓట్లు సాధించింది. దుబ్బాక బై పోల్‌‌‌‌‌‌‌‌లో 13.48 శాతం ఓట్లే వచ్చాయి. జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాభావం పాలైంది. 6.64% ఓట్లు మాత్రమే ఆ పార్టీకి వచ్చాయి. గ్రాడ్యుయేట్స్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీస పోటీ ఇవ్వలేకపోయింది. రెండు స్థానాల్లో మొదటి ప్రయారిటీ ఓట్లలో 8.4% ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2018లో 42.04% ఓట్లు వస్తే.. బైపోల్‌‌‌‌‌‌‌‌లో 37.16 శాతానికి వచ్చాయి. ఇక హుజూరాబాద్​బై ఎలక్షన్స్​లో కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2018 ఎన్నికల్లో సెకండ్ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచి 34.60% ఓట్లు సాధించగా.. ఇప్పుడు 1.46 %  ఓట్లే వచ్చాయి.