
న్యూఢిల్లీ : దేశ సర్వీస్ సెక్టార్ పనితీరు ఈ ఏడాది ఆగస్టులో ముందు నెలతో పోలిస్తే కొద్దిగా తగ్గింది. అయినప్పటికీ కొత్త ఆర్డర్లు పెరిగాయని, ఎక్స్‌పోర్ట్స్ రికార్డ్ లెవెల్‌కు చేరుకున్నాయని ఎస్ అండ్ పీ గ్లోబల్ ఇండియా పేర్కొంది.
ఆగస్టు నెలకు గాను పీఎంఐ సర్వీసెస్ ఇండెక్స్ 60.1 గా రికార్డయ్యింది. జులైలో ఇది 62.3 గా ఉంది. వరుసగా 25 వ నెలలోనూ సర్వీసెస్ పీఎంఐ 50 కి పైనే నమోదయ్యింది. పీఎంఐ 50 కి పైన ఉంటే సంబంధిత సెక్టార్ విస్తరిస్తున్నట్టు. ఇండియన్ సర్వీసెస్ కంపెనీల ఎక్స్‌పోర్ట్స్ ఆగస్టులో 13 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నాయని ఎస్ అండ్ పీ గ్లోబల్ పేర్కొంది.