ఛలో అసెంబ్లీకి వెళ్తున్న యాదవులు అరెస్టు

ఛలో అసెంబ్లీకి వెళ్తున్న యాదవులు అరెస్టు

యాదవుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని.. జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న యాదవులను మీర్ పేట పోలీసులు అరెస్టు చేశారు. శాంతియుతంగా వెళ్తున్న తమను అరెస్టు చేయడం సరికాదని పోలీసుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణలో 20  శాతం ఉన్న యాదవులకు.. యాదవ కార్పొరేషన్ తో పాటు, ఎత్తివేసిన ఎస్ఎన్డిపి రిజర్వేషన్లు ఈ బడ్జెట్ సమావేశంలో కల్పించాలని కోరారు. ప్రభుత్వం తమను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభించాలని డిమాండ్ చేస్తే.. సీఎం కేసీఆర్ పట్టించుకోలేని యాదవ హక్కుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. యాదవుల ఓట్లు కావాలి కాని.. వారి డిమాండ్లు మాత్రం ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు.