రూ.25 పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర

రూ.25 పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర

కొత్త సంవత్సరంలో మొదటి రోజే చమురు మార్కెటింగ్ కంపెనీలు, వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చాయి. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర సిలిండర్‌కు రూ. 25 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. కాగా డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల రేట్లలో ఎలాంటి పెంపూ లేకపోవడం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. ఈ పెంపుతో ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర నేటి నుంచి రూ.1,769గా కానుంది.

ఈ పెంచిన వాణిజ్య సిలిండర్ ధరలు ఈ రోజు నుంచి అంటే జనవరి 1, 2023 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో చిన్న చిన్న రెస్టారెంట్లు, హోటళ్లల్లో భోజనం చేయడం ఇక మీదట ఖర్చుతో కూడినదిగా మారబోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో హైదరాబాద్ లో19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1973 కు చేరగా.. విజయవాడలో పూ,1947కు చేరుకుంది. 

పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లు

ఢిల్లీ - రూ.1768
ముంబై - రూ.1721
కోల్ కతా - 1870
చెన్నై - 1917