మళ్లీ పెరిగిన బంగారం ధర

మళ్లీ పెరిగిన బంగారం ధర

న్యూడిల్లీ: గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధానిలో పది గ్రాముల బంగారం ధర రూ.37 పెరిగి రూ.51,389కు (24 క్యారెట్లు) చేరుకుంది. గ్లోబల్గా గోల్డ్కు పాజిటివ్ ట్రెండ్ ఉన్నట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. గత సెషన్లో 10 గ్రాముల బంగారం ధర రూ.51,352 వద్ద ఉంది. సిల్వర్ రేట్లు మాత్రం రూ.915 తగ్గి కేజీ రూ.61,423గా రికార్డయింది.  ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ధర ఒక ఔన్స్ 1,895 డాలర్లపైన ట్రేడైంది. సిల్వర్ ఒక ఔన్స్ 23.60 డాలర్ల వద్ద ఉంది.

కళ్యాణ్ జ్యూవెలర్స్ పండుగ ఆఫర్లు

పండుగ సీజన్కు కళ్యాణ్ జ్యూవెలర్స్ ఆకర్షణీయమైన ఆఫర్లను  ప్రకటించింది.  కస్టమర్లకు 300 కేజీల బంగారాన్ని గిఫ్ట్గా అందించనున్నట్టు తెలిపింది. కస్టమర్లకు ఇన్స్టాంట్ గిఫ్ట్ ఓచర్లను ఇస్తారు. వీటి విలువ 300 కేజీల బంగారానికి సమానమని కంపెనీ తెలిపింది.  వీటితో స్పెషల్ డిస్కౌంట్లు పొందవచ్చు. గోల్డ్ జ్యూవెలరీపై 15 శాతం నుంచి 50 శాతం వరకు, డైమండ్ జ్యూవెలరీపై 25 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్ నవంబర్ 30 వరకు  ఉంటుంది.