సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన కందిపప్పు ధరలు..

సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన కందిపప్పు ధరలు..

ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. ఈ పాట మనం అందరం ఎన్నో సార్లు వినే ఉంటాం. అయితే.. ప్రస్తుతం ప్రజల పరిస్థితి అలానే మారింది. సామాన్య ప్రజలను ఏవస్తువు వదిలిపెట్టడం లేదు..ఎక్కడ కూడా తగ్గేదెలా అంటూ ధరల మోత మోగిస్తున్నాయి. మొన్నటి వరకు టమాటా ధరలు ఆకాశానికి అంటగా..ఇప్పుడు కందిపప్పు నేను కూడా అంతే అంటూ డబుల్ సెంచరీకి వెళ్తుంది. కందిపప్పు వల్ల… జీర్ణక్రియ మెరుగవుతుంది, మలబద్ధకం సమస్య తీరుతుంది.  గుండెకు సంబంధించిన సమస్యల్ని కందిపప్పు నివారిస్తుంది… గుండెకు వ్యాధులు రాకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెపుతుంటారు. దీంతో మారే ఏ పప్పుకు లేని డిమాండ్ కందిపప్పును ఏర్పడుతుంది. దీంతో కందిపప్పు (Toor Dal) ధర రోజు రోజుకు పెరుగుతుంది. అసలు డైలీ కందిపప్పు తినేవారు కూడా ఉన్నారు. ఇలాంటి ఈ సమయంలో కందిపప్పు ధర పెరుగుతుండడం సామాన్య ప్రజలను గగ్గోలు పెట్టిస్తుంది.

పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్య ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.  తాజాగా, కందిపప్పు ధరలు అమాంతం ఆకాశానికి పెరిగేసాయి.  కేజీ కందిపప్పు రూ. 150 ఉండగా.. ఇప్పుడు  ఏకంగా 50 రూపాయలు పెరిగి 200 లకు చేరింది. దీంతో సామాన్య, పేద ప్రజలకు కందిపప్పు అందని ద్రాక్షలా మారిపోయింది. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు కందిపప్పు ధర పెరిగి షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి.

కంది సాగు తగ్గడం, ఉత్పత్తి పడిపోవడంతో పప్పు ధర పెరుగుతుందని చెబుతున్నారు. వచ్చే రోజుల్లో కిలో కంది పప్పు రూ. 200 లకు పైనే ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో పేదలు కంది పప్పు కొనలేరు. గతంలో కందిపప్పు ధర పెరిగినప్పుడు రేషన్ షాపుల ద్వారా కంది పప్పును రాయితీతో అందించారు. కానీ ఇప్పుడు అలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా స్పందించి కంది పప్పును రేషన్ షాపుల ద్వారా రాయితీపై అందించాలని ప్రజలు కోరుతున్నారు

. దేశవ్యాప్తంగా కంది సాగు తగ్గిపోయింది. ఫలితంగా ఉత్పత్తి కూడా పడిపోయింది. 2018లో 43లక్షల టన్నుల ఉత్పత్తి లభించగా.. 2023లో 34లక్షల టన్నులకు తగ్గింది. కంది పప్పు ధర పెరుగుతోంది. మరోవైపు కేంద్ర కూడా కంది పప్పు దిగుమతి పెంచడానికి చర్యలు తీసుకుంటోంది.  కేంద్ర ప్రభుత్వం పెరుగుతున్న ధరలను అదుపులోకి తెవడానికి ప్రయత్నం చేస్తోంది.

పేద, మధ్యతరగతి కుటుంబాలకు పండగ వేళ పప్పన్నం కూడా కరువయ్యేలా ఉందని అంటున్నారు. ప్రస్తుతం పండుగల వేళ పప్పులు ధరల పెంపుతోపాటు బియ్యం ధరలు పెరగడం సామాన్యులకు మింగుడుపడడం లేదు. ఇప్పటికే అన్ని రకాలుగా నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతోపాటు విద్యుత్‌ చార్జీలు వంటివి దారుణంగా పెరగడం సామాన్య, మధ్యతరగతి ప్రజలను అష్టకష్టాలపాలు చేసింది. కొన్ని కుటుంబాల్లో జీవనం ఎలా గడుస్తున్నదో తెలియని అయోమయం నెలకొంటోంది. ఏది ఏమైనప్పటికి కందిపప్పు ధర రోజు రోజుకు పెరగడం అనేది సామాన్య ప్రజలను కన్నీరు పెట్టిస్తుంది. టమాటా విషయంలో ఎలాగైతే సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నారో..కందిపప్పు విషయంలో కూడా అలాగే చేయాలని ప్రభుత్వాలను సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు