వెండి, బంగారంపై గుడ్​ న్యూస్​

వెండి, బంగారంపై గుడ్​ న్యూస్​

దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.100 తగ్గి రూ.50,050కు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.110 తగ్గి రూ.54,600కు చేరుకుంది. కిలో వెండిపై రూ.200 వరకూ తగ్గి  రూ.74 వేలుగా పలుకుతోంది.

నగరాల్లో బంగారం ధరలు ఇలా..

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,080గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,630గా పలుకుతోంది. విజయవాడలో 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,050గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,600గా ఉంది. అటు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,950.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,580గా పలుకుతోంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.50,100.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,650 ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,050 కాగా... 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,600గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,200... 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,750గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,050కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,600గా పలుకుతోంది. 

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌, విజయవాడ, చైన్నై,  బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ. 74,000గా పలుకుతోంది. పుణే, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో కిలో వెండి ధర రూ.70,300 గా ఉంది.