దేశంలో కోటి మంది వృద్ధులకు మతిమరుపు

దేశంలో కోటి మంది వృద్ధులకు మతిమరుపు
  •     ఢిల్లీ ఎయిమ్స్, విదేశీ వర్సిటీల జాయింట్ ​స్టడీలో వెల్లడి 

న్యూఢిల్లీ:  మతిమరుపు బాధితులు పెరుగుతున్నారు. ప్రత్యేకించి వృద్ధుల్లో మతిమరుపు సమస్య ఎక్కువవుతోంది. మనదేశంలో  60 ఏళ్లకు పైబడినవారు  ఇంచుమించు15 కోట్ల మంది  ఉన్నారు. వీరిలో దాదాపు కోటి (8.44 శాతం)  మందికి మతిమరుపు ఉందని ఢిల్లీ ఎయిమ్స్​, సర్రీ వర్సిటీ (ఇంగ్లండ్) , సౌతెర్న్​కాలిఫోర్నియా  వర్సిటీ (అమెరికా), మిచిగాన్​ వర్సిటీ (అమెరికా) సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది.  ఇండియాలోని 30వేల మందికిపైగా వృద్ధుల ఆరోగ్య స్థితిగతులపై ఇటీవల నిర్వహించిన ఓ సర్వే నివేదికను సెమీ సూపర్​ వైజ్డ్​ మెషీన్ లెర్నింగ్​ అనే ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ (ఏఐ) టెక్నిక్​ద్వారా విశ్లేషించి ఈ అంచనాకు వచ్చారు. వృద్ధుల్లోనూ ప్రత్యేకించి మహిళలు, నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతాల వారిలో మతిమరుపు ప్రాబ్లమ్స్​ ఎక్కువగా ఉన్నాయని స్టడీ రిపోర్ట్​లో పేర్కొన్నారు.