ఇన్‌స్టాగ్రామ్‌ లో ఇక లైక్ లు కనిపించవు

ఇన్‌స్టాగ్రామ్‌ లో ఇక లైక్ లు కనిపించవు

సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసిన ఫోటోలకు ఇక లైక్స్ రావని ఆ సంస్థ యాజమాన్యం తెలిపింది. కాకపోతే అది మన దేశంలో కాదు, అస్ట్రేలియాలో. యూజర్స్ కు వచ్చే లైక్స్ పై ఇన్‌స్టాగ్రామ్‌ నిషేధం విధించింది. ఇన్‌స్టాగ్రామ్‌ లో తమ ఫొటోలకు లైక్స్‌ రానివారు మానసికంగా బాగా కుంగిపోతున్నారని, దాంతో ఒకరిద్దరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని యాజమాన్యం తెలిపింది.

అయితే ఇదంతా అబద్ధమని, ఆ యాప్ లో వచ్చే యాడ్స్‌ ద్వారా భారీగా డబ్బును దండుకోవాలన్నదే ఇన్‌స్టాగ్రామ్‌ వైఖరిగా కనిపిస్తోందని ఆస్ట్రేలియా ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ నిపుణులు ఆరోపిస్తున్నారు. యాప్ లో పోస్ట్ చేసే యాడ్స్‌ ఫొటోలకు లైక్స్‌ చాలా తక్కువగా వస్తాయని, అది బయటపడకుండా ఉండేందుకే యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని వారంటున్నారు. ఒకవేళ ఆ లైక్స్ చూసి తమను స్పాన్సర్ చేసే సదరు యాడ్ ఏజేన్సీ కంపేనీలు వెనక్కు వెళతాయనే భయంతో ఈ కొత్త ప్లాన్ తీసుకొచ్చిందని వారు చెబుతున్నారు.