టిక్కెట్ రేట్లు ఇలాగే ఉంటే.. పెద్ద సినిమాలకు వర్కవుట్ కాదు

టిక్కెట్ రేట్లు ఇలాగే ఉంటే.. పెద్ద సినిమాలకు వర్కవుట్ కాదు

హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తిగా కల్పిత కథతో తెరకెక్కిందని ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. చరిత్రలో జరిగిన ఎలాంటి సంఘటనలు, వాటి తాలూకు విషయాలను చేర్చలేదని జక్కన్న క్లారిటీ ఇచ్చారు. 2022, జనవరి 7న ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ముంబై, బెంగళూరు, చెన్నైల్లో ప్రమోషన్లు నిర్వహించిన రాజమౌళి టీమ్.. ఇప్పుడు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ పూర్తిగా ఫిక్షనల్ స్టోరీ అని, ఇందులో ఎలాంటి చారిత్రక ఆధారాలను వినియోగించలేదన్నారు. ‘కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజులు తమ జీవితాల్లో కనిపించకుండా పోయిన మూడ్నాలుగు సంవత్సరాల్లో..  ఒకవేళ వాళ్ల మధ్య బంధం ఏర్పడి ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచనతో  అల్లుకున్న కథ ఇది’ అని జక్కన్న క్లారిటీ ఇచ్చారు. 

తెలంగాణ యాసపై పట్టు ఉంది: ఎన్టీఆర్

1920లో ఇక్కడ తెలంగాణ యాసను ఎలా మాట్లాడేవారో దానికి సంబంధించిన డైలాగులను రాజమౌళి ఇచ్చారు. నేను ఇక్కడే పెరగడంతో తెలంగాణ యాసపై స్వతహాగా పట్టు ఉంది. దీంతో సినిమాలో డైలాగులను చెప్పడంలో పెద్దగా ఇబ్బంది అనిపించలేదు.

పెద్ద సినిమాలకు వర్కవుట్ కాదు

ఆంధ్ర ప్రదేశ్ లో టిక్కెట్ల రేట్లు పెంచాలని జగన్ సర్కారును ఆర్ఆర్ఆర్ టీమ్ కోరింది. ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లామని, వాళ్లు సానుకూలంగా స్పందిస్తారనే నమ్మకం ఉందని చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య అన్నారు. టిక్కెట్ రేట్ల తగ్గుదల పెద్ద సినిమాలకు వర్కవుట్ కాదని.. ఈ సమస్య పరిష్కారం కోసం సాధ్యమైనంతగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు.