సమస్యలపై ప్రశ్నించిన గ్రామస్తుడిని కాలితో తన్నిన సర్పంచ్

సమస్యలపై ప్రశ్నించిన గ్రామస్తుడిని కాలితో తన్నిన సర్పంచ్

వికారాబాద్: గ్రామంలోని సమస్యలపై ప్రశ్నించిన సామాన్యున్ని బూటు కాలుతో టీఆర్ఎస్ సర్పంచ్ తన్నాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మార్పల్లి మండల పరిధిలోని దామస్తాపూర్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన పిట్టల శ్రీనివాస్ అనే వ్యక్తి.. గ్రామంలో నీటి సమస్య, డ్రైనేజీ సమస్యలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారని.. వెంటనే వాటిని పరిష్కరించాలని సర్పంచ్ జైపాల్ రెడ్డిని ప్రశ్నించాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఒక గొడవను దృష్టిలో పెట్టుకున్న సర్పంచ్.. అవన్నీ నీకెందుకురా అంటూ శ్రీనివాస్ మీద దాడి చేసి కాలుతో తన్నడం మొదలుపెట్టాడు. సర్పంచ్ చర్యకు ఖంగుతిన్న శ్రీనివాస్.. గ్రామ సమస్యలు అడిగితే దాడిచేస్తారా అని వాపోయాడు. అనంతరం మార్పల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి సర్పంచ్ మీద ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు జరిపి కేసు నమోదు చేస్తామని ఎస్సై వెంకటశీను తెలిపారు.  

For More News..

ఒక్కో ద్రాక్ష పండు రూ.35,000.. ఎందుకు అంత రేటు?

వరుసకు అన్న అయ్యే వ్యక్తితో లవ్ మ్యారెజ్..