కరీంనగర్ కలెక్టర్ చాంబర్ ఎదుట సర్పంచుల ఆందోళన

కరీంనగర్ కలెక్టర్ చాంబర్ ఎదుట సర్పంచుల ఆందోళన

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కలెక్టర్ చాంబర్ ఎదుట సర్పంచులు ఆందోళనకు దిగారు. గ్రామ పంచాయతీలకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ వచ్చి తమ సమస్యలను వినాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. పెండింగ్ బిల్లులు రాకపోవడంతో తామంతా అప్పుల పాలవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంతో పాటు కేంద్రం కూడా తమకు నిధులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.

గ్రామ ఉప సర్పంచుల చెక్ పవర్ ను కూడా రద్దు చేయాలని సర్పంచులు డిమాండ్ చేశారు. మూడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ బిల్లులు, ఏడు నెలలుగా కేంద్ర ప్రభుత్వ బిల్లులు రాలేదని చెబుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని సర్పంచులు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీల సర్పంచులు కూడా పాల్గొన్నారు.