ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ ఎదురీత

ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ ఎదురీత

371 రన్స్‌‌ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో 114/4

లండన్‌‌: యాషెస్‌‌ సిరీస్‌‌లో వరుసగా రెండో టెస్టు థ్రిల్లింగ్‌‌ ఫినిషింగ్‌‌కు వచ్చింది. హోరాహోరీగా సాగుతున్న  రెండో మ్యాచ్‌‌లో ఆస్ట్రేలియా పైచేయి సాధించగా... ఇంగ్లండ్‌‌ ఓటమికి ఎదురీదుతోంది. ఆస్ట్రేలియా ఇచ్చిన 371 రన్స్‌‌ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో శనివారం, నాలుగో రోజు చివరకు రెండో ఇన్నింగ్స్‌‌లో ఇంగ్లండ్‌‌  111/4  స్కోరుతో నిలిచింది. జాక్‌‌ క్రాలీ (2), ఒలీ పోప్‌‌ (3)ను స్టార్క్‌‌, జో రూట్‌‌ (18), హారీ బ్రూక్‌‌ (4)ను కమిన్స్‌‌ ఔట్‌‌ చేయడంతో 45/4తో కష్టాల్లో పడ్డ హోమ్‌‌టీమ్‌‌ను బెన్‌‌ డకెట్ (50 బ్యాటింగ్​), కెప్టెన్‌‌ స్టోక్స్‌‌ (29 బ్యాటింగ్) ఆదుకున్నారు. ఇంగ్లిష్‌‌ టీమ్‌‌ విజయానికి చివరి రోజు  మరో 257రన్స్ అవసరం కాగా.. ఆసీస్‌‌కు 6 వికెట్లు కావాలి. 

అంతకుముందు ఓవర్‌‌నైట్‌‌ స్కోరు 130/2తో ఆట కొనసాగించిన కంగారూ టీమ్‌‌ రెండో ఇన్నింగ్స్‌‌లో 279 స్కోరు వద్ద ఆలౌటైంది. ఓవర్‌‌నైట్‌‌ బ్యాటర్లు ఖవాజ (77), స్టీవ్‌‌ స్మిత్‌‌ (34) ఔటైన తర్వాత ఆసీస్‌‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. హెడ్‌‌ (7), గ్రీన్‌‌ (18), క్యారీ (21), కమిన్స్‌‌ (11) నిరాశ పరిచారు. హోమ్‌‌టీమ్‌‌ బౌలర్లలో స్టువర్ట్‌‌ బ్రాడ్‌‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. జోష్‌‌ టంగ్‌‌, ఒలీ రాబిన్సన్‌‌ చెరో రెండు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌‌లో  ఆసీస్‌‌ 461, ఇంగ్లండ్‌‌ 325 స్కోర్లు చేశాయి.