నేటి నుంచి రెండోవిడత బడ్జెట్ ​సమావేశాలు

నేటి నుంచి రెండోవిడత బడ్జెట్ ​సమావేశాలు

నేటి నుంచి రెండోవిడత బడ్జెట్ ​సమావేశాలు

ఫైనాన్స్​ బిల్లుకే తొలిప్రాధాన్యం : కేంద్రం

న్యూఢిల్లీ : రెండో విడత బడ్జెట్​ సమావేశాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. ఈసారి ఫైనాన్స్​ బిల్లును పాస్​చేయడానికి తొలి ప్రాధాన్యమిస్తామని కేంద్రం చెబుతుండగా.. రాజకీయ ప్రత్యర్థలపైకి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్న అంశాన్ని లేవనెత్తుతామని ప్రతిపక్షాలు అంటున్నాయి. హిండెన్​ బర్గ్​–అదానీ గ్రూపు వ్యవహారంపైనా సర్కారును నిలదీస్తామని చెబుతున్నాయి. ఉభయ సభల్లో ప్రస్తావించాల్సిన  అంశాలపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీలు సోమవారం ఉదయం భేటీ కానున్నాయి.

ఫైనాన్స్​ బిల్లును పాస్​ చేయించడానికే తాము తొలి ప్రాధాన్యమిస్తామని.. ఆ తర్వాతే విపక్షాల డిమాండ్లపై చర్చ నిర్వహిస్తామని  పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్​ రాం మేఘ్వాల్​ స్పష్టం చేశారు. రైల్వే, పంచాయతీ రాజ్​, టూరిజం, సాంస్కృతిక, ఆరోగ్య శాఖలకు గ్రాంట్ల కేటాయింపునకు సంబంధించిన డిమాండ్లపై ఉభయ సభల్లో చర్చలు జరుగుతాయని తెలిపారు. ఇక సోమవారం బడ్జెట్​ సెషన్ ప్రారంభం కాగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సప్లిమెంటరీ గ్రాంట్లను కోరుతూ  వచ్చిన  డిమాండ్లను చదివి వినిపిస్తారు. కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్మూకశ్మీర్​ కు సంబంధించిన బడ్జెట్​ (2023‌‌–24)ను కూడా నిర్మల ప్రవేశపెడతారు.  ఏప్రిల్​ 6 వరకు రెండో విడత బడ్జెట్​సెషన్స్​ కొనసాగనున్నాయి.