బాల్ థాక్రే పేరు వాడితే కఠిన చర్యలు

బాల్ థాక్రే పేరు వాడితే కఠిన చర్యలు

ముంబయి: మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రెబల్ ఎమ్మెల్యేలపై కఠినంగా వ్యవహరించాలని శివసేన జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అనారోగ్యంగా ఉన్నా ఈ సమావేశానికి హాజరైన ఉద్దవ్ థాక్రే.. కీలక ప్రసంగం చేశారు. ఈ సమావేశంలో ఆరు తీర్మానాలను ఆమోదించిన శివసేన.. పార్టీ వీడిన వాళ్లు బాల్ థాక్రే పేరు ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇక పార్టీ వీడిన నేతల గురించి తాను ఆలోచించబోనని ఉద్దవ్ స్పష్టం చేశారు. రెబల్ ఎమ్మెల్యేలు  ఏం చేయాలనుకుంటున్నారో అది చేయొచ్చని ప్రకటించారు.

రెబల్ ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేయాలని సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. బాల్ థాక్రే పేరు చెప్పకుండా ఓట్లు అడగాలని సూచించారు. హిందుత్వాన్ని శివసేన ఎన్నటికీ వీడబోదన్నారు. పార్టీ విధానాలను ధిక్కరిస్తున్న నేతలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెబల్ ఎమ్మెల్యేలు చేసిన ద్రోహాన్ని ప్రజల్లో ఎండగడుతామని చెప్పారు. పార్టీ కోసం తాము రక్తాన్ని చిందించామని, శివసేనను ఎవరూ దెబ్బతీయలేరని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.