వాటర్​బోర్డు ఉద్యోగి కొడుకు ఇంటర్నేషనల్ కరాటే చాంపియన్

వాటర్​బోర్డు ఉద్యోగి కొడుకు ఇంటర్నేషనల్ కరాటే చాంపియన్

హైదరాబాద్,వెలుగు:  వాటర్​ బోర్డు ఉద్యోగి కొడుకు అంతర్జాతీయ కరాటే పోటీలో గోల్డ్ మెడల్ సాధించాడు. డివిజన్ 8లో టీజీ-–2లో పని చేసే పురణ్​సింగ్ కొడుకు శంశాక్ సింగ్ మలేషియాలో జరిగిన అంతర్జాతీయ కరాటే చాంపియన్ షిప్ – -2024 విజేతగా నిలిచాడు. బుధవారం వాటర్​బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డి ఖైరతాబాద్ లోని హెడ్డాఫీసులో శశాంక్ ను సన్మానించారు. భవిష్యత లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.  అంతర్జాతీయ కరాటే పోటీల్లో 27 దేశాల నుంచి పోటీ పడగా భారత్ నుంచి శశాంక్ పాల్గొని గోల్డ్ మెడల్ గెలుపొందాడు.  ప్రస్తుతం శశాంక్ సంగారెడ్డిలోని లిటిల్ బర్డ్స్ స్కూల్ లో చదువుతున్నాడు. మూడేండ్ల నుంచి బాల్ పతి నటరాజన్ ఆధ్వర్యంలో కరాటేలో శిక్షణ పొందుతున్నాడు. అయిదేండ్ల నుంచి శిక్షణ ఇస్తున్నట్లు తండ్రి పురాన్ సింగ్ తెలిపారు.