జవాన్​.. పొలం బాట

జవాన్​.. పొలం బాట

 

  •     1,500 ఎకరాల్లో సాగుకు ప్లాన్​
  •     గ్రీన్​ అగ్రికల్చర్​ స్టీరింగ్​  కమిటీ ఏర్పాటు
  •     జులై నుంచి పనులు మొదలు

కొలంబో: తినడానికి తిండి లేక అల్లాడుతున్న జనాలను ఆదుకోవడానికి శ్రీలంక ఆర్మీ ముందుకొచ్చింది. భవిష్యత్తులో ఆహార కొరతను తప్పించేందుకు వ్యవసాయం చేయడానికి సిద్ధమవుతోంది. దాదాపు 1500 ఎకరాల బంజరు, ప్రభుత్వ భూములను చదునుచేసి సాగుకు రెడీ చేయాలని నిర్ణయించింది. చాలామంది రైతులు వ్యవసాయానికి స్వస్తి చెప్పడంతో జవాన్లతోనే పొలంబాట పట్టాలని ప్లాన్​ చేస్తోంది. ఇందుకోసం గ్రీన్​ అగ్రికల్చర్​ స్టీరింగ్ ​కమిటీ(జీఏఎస్​సీ)ని ఏర్పాటు చేసింది. ఈ వ్యవసాయ ప్రాజెక్టుకు  లెఫ్టినెంట్​జనరల్ ​వికుమ్​ లియనాగే హెడ్​గా ఉంటారు. ఈ మొత్తం ప్రాజెక్టును చీఫ్​ ఆఫ్​ స్టాఫ్ ​మేజర్​ జనరల్ ​జగత్​ కొడితివాక్కు సూపర్​వైజ్​ చేస్తారు. అగ్రికల్చర్​ చేసేందుకు అవసరమైన యంత్ర సామగ్రిని సమకూర్చుకుని జులై నుంచి సైనికులు పొలం బాట పడతారు. దీనికి ముందు జవాన్లు భూమిని చదునుచేసి కలుపు తీయడం చేస్తారు. అగ్రి కల్చర్​ ఎక్స్​పర్టులతో మాట్లాడి.. భూమి సారాన్ని పరీక్షించడంతో పాటు ఏ పంట వేస్తే బాగుంటుందన్న దానిపై సలహాలు ​తీసుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సెక్యూ‌‌‌‌‌‌‌‌రిటీ ఫోర్స్​లు​ హెడ్​క్వార్టర్స్ ​ఫార్మేషన్​ కోసం స్ర్కీనింగ్​ చేస్తున్నాయి. భూమిని ఎంపిక చేసే ముందు జవాన్లు అందరూ.. ముందుగా గవర్నర్లు, డిస్ట్రిక్ట్స్​, డివిజనల్​ సెక్రెటరీలు, ల్యాండ్​ ఆఫీసర్లు, గ్రామ సేవ అధికారుల​తో భేటీ అవుతారు. రాబోయే కొన్ని నెలల పాటు ఫుడ్​ క్రైసిస్​ ఉంటుందని, అందుకే భారత్​ నుంచి క్రెడిట్ ​లైన్ ​కింద 50,000 మెట్రిక్​ టన్నుల రైస్​ దిగుమతి చేసుకోవాలని నిర్ణయించామని శ్రీలంక ప్రధాని రణిల్​ విక్రమసింఘే ప్రకటించారు. దీంతో స్వయంగా ఆర్మీయే రంగంలోకి దిగింది. ఇండియన్ లోన్ అసిస్టెన్స్ ప్రోగ్రాం కింద స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్‌‌‌‌కు నిధులు కేటాయించేందుకు ప్రధాని కార్యాలయంలో జరిగిన చర్చ తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు అక్కడి మీడియా వెల్లడించింది. ఆర్థిక సంక్షోభం నుంచి కొద్దిగా గట్టెక్కి.. ఆహార కొరత తీర్చేందుకు శ్రీలంక ప్రభుత్వానికి, మార్చిలో భారత్​1 బిలియన్​ డాలర్ల క్రెడిట్ ​లైన్​ను విస్తరింపజేసింది. ఫర్టిలైజర్ల బ్యాన్​ తరువాత.. శ్రీలంక సొంతంగా రైస్​ ప్రొడక్షన్​ ప్రారంభించుకుంది. దీనికి ముందు కెమికల్​ఫర్టిలైజర్స్​పై 2021, ఏప్రిల్​లో గొటబాయ రాజపక్స ప్రభుత్వం నిషేధం విధించింది. రానున్న ఆరు నెలల పాటు పాలన కొనసాగించేందుకు, ఫుడ్​ క్రైసిస్​ తీర్చేందుకు శ్రీలంకకు 5 బిలియన్​ 
డాలర్ల అవసరం ఉంది.