చమిక కరుణరత్నేపై ఏడాదిపాటు నిషేధం

చమిక కరుణరత్నేపై ఏడాదిపాటు నిషేధం

శ్రీలంక క్రికెట్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీలంక ఆల్ రౌండర్ చమిక కరుణరత్నేపై ఏడాది పాటు నిషేధం విధించింది. ప్రస్తుతం అతని ఫాం జట్టుకు అవసరం అయినప్పటికీ కరుణరత్నే చేసిన ఓ తప్పు అతనిపై నిషేధం విధించేలా చేసింది. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో లంక బోర్డ్, ప్లేయర్లకు మధ్య ఉన్న అగ్రిమెంట్లను కరుణరత్నే ఉల్లంఘించడమే అతనిపై నిషేధం విధించేలా  చేసింది.

శ్రీలంక బోర్డ్ ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని నియమించి, కరుణరత్నేపై విచారణ జరిపింది. ఆ విచారణలో నిబంధనలకు విరుద్దంగా నడుచుకున్నట్టు కరుణరత్నే అంగీకరించాడు. దీంతో అతనిపై ఏడాదిపాటు నిషేధంతో పాటు, 5000 డాలర్లు (రూ.4 లక్షల) జరిమానా విధించారు. అయితే.. ప్రపంచకప్ జరుగుతున్న సమయంలో కొన్ని క్యాసినో కార్యక్రమాలు, లావాదేవీల్లో పాల్గొడమే కరుణరత్నేపై నిషేధానికి కారణం అంటున్నారు బోర్డు సభ్యులు.