వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధం

వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధం

ఏపీలో మే 13వ తేదీన జరిగిన పోలింగ్ సందర్భంగా.. మాచర్ల నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ లో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దౌర్జన్యం చేయటం.. ఈవీఎం మెషీన్ ను ధ్వంసం చేయటంపై ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మాచర్ల నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తున్న పిన్నెల్లిని వెంటనే అరెస్ట్ చేయాలని లుకౌట్ నోటీసులు జారీ చేసింది ఈసీ.

దీంతో ఆయన కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే పిన్నెల్లి మాచర్ల నియోజకవర్గంలో లేరని.. అజ్ణాతంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్  కేంద్రం 202లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో పోలింగ్  కేంద్రం 202తో పాటు ఏడు కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు.

ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన అన్ని వీడియో పుటేజీలను జిల్లా ఎన్నికల అధికారులు తమకు అందజేశారని, దీంతో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి చెప్పాలని సీఈఓ ముకేశ్ కుమార్ మీనాను ఆదేశించింది