తుఫాను వచ్చింది.. గాల్లోకి ఎగిరిపోయారు

తుఫాను వచ్చింది.. గాల్లోకి ఎగిరిపోయారు

చైనాలో వచ్చిన ఓ తుఫాను బీభత్సం సృష్టించింది. దాని ధాటికి ఇంటి పై కప్పులు, భవన పై కప్పులే కాదు మనుషులు సైతం ఎగిరిపోయారు. సెంట్రల్ చైనాలో ని హుబీ ప్రావిన్స్ లో ఉన్న యిచాంగ్ సిటీకి తుఫాన్ రానుందని వెదర్ రిపోర్ట్స్ వచ్చాయి. తుఫాన్ వస్తున్న సమయంలో జరిగిన విధ్వంసానికి సంబంధించిన వీడియోలు పలువురు ట్విటర్ లో షేర్ చేశారు. ఈ వీడియోలో రెస్టారెంట్ లో ఉన్న బలమైన ఇనుప స్తంభాలు పట్టుకుని ఉన్న పలువురు వ్యక్తులు కనిపిస్తున్నారు. గాలి ధాటికి ఇనుప స్తంభాలతో పాటు మనుషులు కూడా గాల్లోకి ఎగరడం భయాందోళనలకు గురి చేసింది. ఈ ప్రమాదంలో రెస్టారెంట్ ఓనర్ తో పాటు చాలా మందికి గాయాలయ్యాయి. 

చైనాకు కొత్తేమీ కాదు..

భారీ తుఫానులు చైనాకి కొత్తేమీ కాదు. మార్చిలో బీజింగ్ అంతటా ఇసుక తుఫాన్ వచ్చింది. ఇది వాయు కాలుష్యాన్ని పెంచింది. బీజింగ్లో గాలి నాణ్యత సూచిక హైలెవెల్ 500 కి చేరుకుంది. ఆ సమయంలో కూడా ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదర్కున్నారు. కలుషితమైన గాలితో చాలా మంది ఆసుపత్రిపాలయ్యారు.