
ఎప్పుడెప్పుడా అని సినీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా వెయిట్ చేసిన ‘కేజీయఫ్ 2’ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ వచ్చింది. మొదటి పార్ట్ కంటే కాస్త ఎమోషన్ తగ్గిందనే కామెంట్స్ వస్తున్నా.. మాస్ ఆడియెన్స్ విజిల్స్‌తో థియేటర్లు మార్మోగు తున్నాయి. ముఖ్యంగా సినిమా అయిపోయాక చివర్లో రివీల్ చేసిన ఒక విషయం ప్రేక్షకులకి పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది. అదేంటంటే.. కేజీయఫ్ కథ ఇంతటితో అయిపోలేదు. మరో పార్ట్ రాబోతోంది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో దీని గురించి అడిగినప్పుడు దర్శకుడు ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇవ్వలేదు. తర్వాత తెలుస్తుందంటూ మాట దాటవేశాడు. బహుశా ఇలా ఆడియెన్స్‌ని సర్‌ప్రైజ్ చేయడం కోసమే దాచిపెట్టి ఉండొచ్చు. ఏదేమైనా ‘కేజీయఫ్ 3’ అనౌన్స్‌మెంట్ అందరిలో జోష్‌ని నింపడం ఖాయం. అయితే ప్రస్తుతం ప్రభాస్‌తో ‘సాలార్’ తీస్తున్నాడు ప్రశాంత్. వచ్చే నెలాఖరులో టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు రీసెంట్‌గా ప్రకటించాడు. సినిమా ఇయర్ ఎండింగ్‌కి వస్తుందా లేక నెక్స్ట్ ఇయర్ విడుదలవుతుందా అనేది ఇంకా తేలలేదు. పైగా ప్రశాంత్‌కి ఎన్టీఆర్‌తోనూ కమిట్‌మెంట్ ఉంది. మరి రాకీ భాయ్ కథని మళ్లీ ఎప్పుడు పట్టాలెక్కిస్తాడో!