రాష్ట్ర విభజనపై కేసు విచారణను ఏప్రిల్ 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

రాష్ట్ర విభజనపై కేసు విచారణను ఏప్రిల్ 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

రాష్ట్ర విభజనపై కేసు విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ 11కు వాయిదా వేసింది. ఏపీ విభజనకు సంబంధించి నమోదైన పలు పిటిషన్లను ఏప్రిల్‌11న విచారిస్తామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర విభజనపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, తెలంగాణ వికాస్ కేంద్ర సహా పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదని, దీనివల్ల రెండు రాష్ట్రాల మధ్య చాలా సమస్యలు తలెత్తుతున్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర విభజన జరగాలంటే.. కొన్ని ప్రత్యేక పరిస్థితులు, నియమ నిబంధనలు అవసరమని, ఆ మేరకు కేంద్రానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. గత విచారణ సమయంలో కేసు విచారణను సుప్రీంకోర్టు ఇవాళ్టి( ఫిబ్రవరి 22, 2023)కి వాయిదా వేసిన విషయం తెలిసిందే.