82 ఏళ్ల భార్యకు విడాకులు ఇస్తావా..? : పిటీషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

82 ఏళ్ల భార్యకు విడాకులు ఇస్తావా..? : పిటీషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురానుభూతి. పెళ్లి విషయంలో చాలామంది చాలా కోరికలు, కలలు ఉంటాయి. ముఖ్యంగా భారతీయ వివాహ వ్యవస్థలో విడాకులనేవి చాలా వరకు తక్కువ. చిన్న చిన్న విషయాలకు చాలామంది విడాకుల కోసం కోర్టుల వరకూ వెళ్తున్నారు. న్యాయస్థానాలు అన్ని సాక్ష్యాలను పరిశీలించి నిజనిజాలు పరిశీలించిన తర్వాతనే విడాకులు మంజూరు చేస్తున్నాయి. ఇరువురు అంగీకారం మేరకు మాత్రమే విడుకులు ఇస్తున్నాయి. దంపతులు కలిసి ఉండేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. చిన్న చిన్న వివాదాలకు విడిపోవడాన్ని కోర్టులు ప్రశ్నించడం గతంలో చాలా చూశాం. 

తన భార్య నుంచి విడాకులు కావాలని కోరిన ఓ 89 ఏళ్ల వ్యక్తి విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దాదాపుగా 27 పాటు కొనసాగిన ఈ కేసులో విడాకులను తిరస్కరించింది. వివాహాన్ని రద్దు చేస్తే భార్యకు అన్యాయం జరుగుతుందని తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది.

Also Read : ప్రవల్లిక ఆత్మహత్యపై 48 గంటల్లో నివేదిక ఇవ్వండి: గవర్నర్

1963లో పెళ్లి అయిన ఇద్దరు దంపతులు కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నారు. ఆ తర్వాత వీరి మధ్య గొడలు మొదలయ్యాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో పని చేస్తున్న భర్తకు 1984లో చెన్నైకి ట్రాన్స్‌ఫర్ అయింది. అయితే ఆయన భార్య మాత్రం ఆయనతో పాటు అక్కడికి వెళ్లేందుకు ఒప్పుకోలేదు.

ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. క్రూరత్వం కింద 1996లో భార్యతో విడాకుల కోసం కోర్టు మెట్లెక్కాడు భర్త​. 2000లో జిల్లా కోర్టులు విడాకులు మంజూరు చేశాయి. అయితే... పై న్యాయస్థానాల్లో తీర్పును సవాల్ చేస్తూ భార్య అప్పీల్ చేసింది. ఈ కేసులు సుప్రీంకోర్టు ముందుకు రావడానికి మరో 20 సంవత్సరాలు పట్టింది. తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు వీరిద్దరికి విడాకులు ఇవ్వడానికి నిరాకరించింది.

వివాహం అనేది భారతీయ సమాజంలో భార్యభర్తల మధ్య పవిత్రమైన, ఆధ్యాత్మిక, అమూల్యమైన భావోద్వేగ జీవిత వలయమని తన తీర్పులో సుప్రీంకోర్టు చెప్పింది. విడాకులు మంజూరు చేస్తే 82 ఏళ్ల భార్యకు అన్యాయం జరుగుతుందని తీర్పులో వివరించింది. తాను ఈ పవిత్రబంధాన్ని గౌరవించడానికి అన్ని ప్రయత్నాలు చేశానని, వృద్ధాప్యంలో తన భర్తను చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె కోర్టుకు చెప్పింది.