ఫుడ్ వేస్టేజ్ తగ్గిందట : కరోనాతో జీవన విధానంలో మార్పు

ఫుడ్ వేస్టేజ్ తగ్గిందట : కరోనాతో జీవన విధానంలో మార్పు

కరోనాతో చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. లాక్ డౌన్ తో కొందరు ఫైనాన్సియల్ గా ఇబ్బందులు పడితే.. మరికొందరు తిండికి లేక అవస్థలు పడ్డారు. సాధారణ రోజుల్లో ఫుడ్ అంటే కేర్ చేయని వాళ్ళు కూడా ఇప్పుడు ఫుడ్ వేస్ట్ చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు.  ఫుడ్ వేస్టెజ్ కూడా 40 నుంచి 18 శాతానికి తగ్గిందని ఓ సర్వేలో తేలింది.

కరోనా మనిషి జీవన విధానంలో చాలా మార్పులు తెచ్చింది. కొందరు కొత్త ఆహారపు అలవాట్లు నేర్చుకున్నారు.  జంక్ ఫుడ్ మానేసి, ఇంటి ఫుడ్ కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆర్థిక పరిస్థితులతో ఆచితూచి ఖర్చు చేస్తుండటంతో పాటు ఆరోగ్యంపైనా దృష్టి పెట్టారు. లాక్ డౌన్ ముందుతో పోలిస్తే… ప్రస్తుతం ఎవరూ ఫుడ్ వేస్టే చేయడం లేదు. గతంతో పోలిస్తే 22 శాతం తగ్గిందని జాతీయ సర్వేలు చెబుతున్నాయి.

కరోనాకి ముందు ఇళ్లల్లో 23 శాతం ఫుడ్ వేస్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు 15 శాతానికి తగ్గింది. కూరగాయల ధరలు, కరోనా కేసులు పెరగడంతో ఇంట్లో నుంచి జనం బయటకు రావడానికి భయపడుతున్నారు.  దీంతో కావాల్సిన కూరగాయలు, పండ్లు లేకపోయినా సర్దుకుంటున్నారు నగరవాసులు. సాధారణంగా ఫంక్షన్స్ లోనే ఫుడ్ ఎక్కువగా వేస్ట్ అవుతుంది. కరోనాతో ఫంక్షన్స్ లేవు. అలాగే హోటల్స్ లోనూ ఫుడ్ వేస్ట్ అవట్లేదు. కరోనాతో హోటల్స్ కి గిరాకీ తగ్గింది. ఒకవేళ ఫుడ్ మిగిలిన పేదలకు పంచుతున్నారు హోటల్ నిర్వాహకులు.

రోజులో ఒక్క పూటయినా బయట ఆహారాన్ని తినేవారు కూడా కరోనాతో హోం ఫుడ్డుకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంట్లో కూడా జంక్ ఫుడ్ కాకుండా ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ తినడంతో గతంతో పోలిస్తే అనారోగ్య సమస్యలు కూడా తగ్గాయంటున్నారు డాక్టర్లు. బయట ఫుడ్ తినేవారి సంఖ్య తగ్గడంతో హోటల్ బిజినెస్ అనుకున్నంత స్థాయిలో నడవడం లేదు. డైలీ వచ్చే కస్టమర్లకే ఆహారం వందుతూ… వృధా కాకుండా జాగ్రత్త పడుతున్నారు హోటల్స్ నిర్వాహకులు.