WPL: మహిళా ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా టాటా

WPL: మహిళా ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా టాటా

ఈ ఏడాది ప్రవేశపెడుతున్న మహిళా ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) టైటిల్ రైట్స్ ను టాటా గ్రూప్ దక్కించుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ‘ప్రారంభ డబ్ల్యూపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా టాటా గ్రూప్ ని ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను. టాటా గ్రూప్ సపోర్టుతో మహిళా క్రికెట్‌ను తర్వాత స్థాయికి తీసుకెళ్లగలమని విశ్వసిస్తున్నామ’ని జైషా తెలిపాడు. 

అయితే, ఎంత మొత్తానికి ఈ రైట్స్ ను టాటా గ్రూప్ దక్కించుకుందో బీసీసీఐ గానీ, టాటా గ్రూప్ గానీ వెల్లడించలేదు. కాకపోతే, రాబోయే ఐదేండ్లపాటు టాటా గ్రూప్ కు కాంట్రాక్టు ఉంటుంది. కాగా మార్చి 4నుంచి మొదలయ్యూ డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ లీగ్ మ్యాచ్ లను ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం, డివై పాటిల్ స్టేడియాల రెండు వేదికలపై నిర్వహించనున్నారు. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంను బ్యాకప్ గా ఎంపికచేశారు.