పీఎం సార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. మా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుమతించండి

పీఎం సార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. మా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుమతించండి

న్యూఢిల్లీ:  ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇండియా ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అనుమతించేలా చొరవ తీసుకోవాలని హెడ్​ కోచ్​ ఇగోర్​ స్టిమాచ్​ పీఎం నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశాడు. 2002 నుంచి ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అండర్-​23 ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆడిస్తున్నారు. అయితే, సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మినిస్ట్రీ నిబంధనల ప్రకారం ఈ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొనేందుకు అనుమతించాలంటే జట్టు ఆసియాలో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-8 ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండాలి. ప్రస్తుతం మన టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 18వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండటంతో మినిస్ట్రీ క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో పీఎం మోదీ, స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనురాగ్​ ఠాకూర్​ కల్పించుకొని జట్టుకు అనుమతి ఇప్పించాలని స్టిమాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇద్దరికీ లెటర్​ రాశాడు.  2017 అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-17 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి జట్టు గొప్పగా ఆడుతోందని, ఎంతో మంది యువ ప్రతిభావంతులు ఉన్న టీమ్ ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడేలా చూడాలని కోరాడు.

ALSO READ :బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫ్లెక్సీ గొడవ