భక్తుల కోసం కనీస సౌలతుల్లేవ్

భక్తుల కోసం కనీస సౌలతుల్లేవ్

 లక్షల్లో వచ్చే భక్తుల కోసం కనీస సౌలతుల్లేవ్
    కాళేశ్వరం వద్ద కంపుకొడ్తున్న ప్రాణహిత
    ఒడ్డు పొడవునా చెత్త, పడేసిన బట్టలు, బురద నీళ్లు
    స్త్రీలు బట్టలు మార్చుకునేందుకు రెండే షెడ్లు.. మరుగుదొడ్లు లేవు
    మహారాష్ట్రలో రూ. 10 కోట్లతో పుష్కర పనులు
    కాళేశ్వరం వద్ద ఏర్పాట్లకు రాష్ట్రం ఇచ్చింది రూ.14 లక్షలు
    రెండు రోజుల్లో పుష్కరాలు 

జయశంకర్‌‌ భూపాలపల్లి/మహదేవ్‌‌‌‌పూర్‌‌‌‌, వెలుగు: ప్రాణహిత పుష్కరాల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంటే.. తెలంగాణ సర్కార్​ మాత్రం పట్టించుకుంటలేదు. లక్షల్లో వచ్చే భక్తుల కోసం కనీస ఏర్పాట్లు చేయడం లేదు. కాళేశ్వరం పుష్కర ఘాట్‌‌‌‌ వద్ద నదిలో ఎటు చూసినా చెత్తాచెదారం కనిపిస్తున్నది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌‌‌‌ రెడ్డి.. ఆఫీసర్లతో సమీక్షలకు మాత్రమే పరిమితమయ్యారు. పుష్కరాలకు రెండు రోజుల గడువు మాత్రమే ఉన్నా.. పెద్దగా చర్యలు చేపట్టడం లేదు. కేవలం రెండే షెడ్లు కట్టగా.. మరుగుదొడ్లు ఎక్కడా కనిపించడం లేదు.

నది పొడువునా చెత్తాచెదారమే

కాళేశ్వరంలో పుష్కరఘాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 100 మీటర్ల పొడవునా ఉంది. దీన్ని 2015లో గోదావరి పుష్కరాల సమయంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రాణహిత పుష్కరాల కోసం కూడా ఇదే ఘాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ నదితీరాన్ని పరిశీలిస్తే ఎటు చూసినా వాడి పడేసిన బట్టలు, ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తువులు, బురదే కనిపిస్తోంది. భక్తులు దిగి పుష్కర స్నానం చేసేలా నీళ్లు లేవు. కొన్ని నెలలుగా కనీసం పుష్కర ఘాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శుభ్రం చేసింది లేదు. రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వచ్చే భక్తులు పడేసిన వస్తువులను క్లీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయట్లేదు. దీంతో వ్యర్థాలతో నీళ్లన్నీ దుర్వాసన వస్తున్నాయి. అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో తాపీగా ఆదివారం చెత్త తొలగింపు పనులు స్టార్ట్​చేశారు. క్లీనింగ్‌‌‌‌‌‌‌‌కే మూడు రోజులు పట్టే అవకాశముందని చెబుతున్నారు.

30 లక్షల మందికి పైనే

ఈ నెల 13 నుంచి 24వ తేదీ దాకా ప్రాణహిత పుష్కరాలు జరగనున్నాయి. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, రాపన్పల్లి ఇంటర్ స్టేట్ బ్రిడ్జి, దేవులవాడ, వేమనపల్లి మండల కేంద్రంతో పాటు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రాణహిత జన్మస్థానమైన తుమ్మిడిహెట్టి వద్ద పుష్కరాలు నిర్వహిస్తామని ప్రభుత్వం ఇది వరకే ప్రకటించింది. తెలంగాణలో తొలిసారి జరగబోయే పుష్కరాల్లో పాల్గొనడానికి మన రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. రోజుకు 2 లక్షల మంది కాళేశ్వరం వస్తారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. 12 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన పుష్కరాల సమయంలో 12 రోజుల్లో 15 లక్షల మంది వచ్చినట్లు రిపోర్టులు ఉన్నాయి. ఈ సారి 30 లక్షల మంది 
వరకు వస్తారని అంచనా. 

ఉమ్మడి ఏపీలో ‘రాష్ట్ర పండుగ’

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో 2010 డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రాణహిత పుష్కరాలు వచ్చాయి. అప్పటి సీఎం కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి.. పుష్కరాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ‘స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌’‌‌‌‌‌‌‌‌గా ప్రకటించి ఏర్పాట్లు చేశారు. కాళేశ్వరం వద్ద ఎండోమెంట్, ఇతర శాఖల తరఫున రూ.9.72 కోట్లు ఖర్చు చేసి పుష్కరాల పనులు చేశారు. సీఎం హోదాలో ఆయన స్వయంగా పుష్కరాల్లో పాల్గొన్నారు. కానీ ఇప్పుడు స్వరాష్ట్రంలో ప్రాణహిత పుష్కరాలను పట్టించుకున్న వాళ్లే లేరు.

మహారాష్ట్రలో ఫుల్‌‌‌‌‌‌‌‌ ఏర్పాట్లు

ప్రాణహిత పుష్కరాల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం సీరొంచ, నగరం గ్రామాల్లో రూ.10 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నది. పుష్కర ఘాట్లకు భక్తులు వెళ్లడానికి వీలుగా డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్లను నిర్మిస్తోంది. అలాగే పుష్కరాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించి ఆఫీసర్లకు సూచనలు ఇవ్వడానికి నదీ తీరం నుంచి సీరొంచ వరకు 70 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. సీరొంచ తహసీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసు నుంచి మానిటరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేలా చర్యలు తీసుకుంది. పుష్కరాలకు వచ్చే భక్తులు స్నానాలు చేసి దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేకంగా గదులను నిర్మించింది. మరుగుదొడ్లు, మూత్రశాలలను కడుతోంది.

పనులు సక్కగ చేస్తలె

పుష్కరాల కోసం గతంలో నిర్మించిన ఘాట్లు, రోడ్లు, టాయిలెట్లు చాలావరకు ధ్వంసమయ్యాయి. వాటికి రిపేర్లు చేయడంతో పాటు ప్రస్తుత రద్దీకి తగ్గట్టు కొత్తవి నిర్మించాలి. పుష్కర ఘాట్లకు వెళ్లే రోడ్లను వెడల్పు చేయాలి. టెంపరరీ టాయిలెట్లు, మహిళలు బట్టలు మార్చుకునేందుకు గదులు, ఎండకాలం కావడంతో జనం సేదతీరేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలి. కరెంట్, తాగునీరు, వైద్య సౌకర్యాలు కల్పించడంతోపాటు పెద్ద ఎత్తున పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు, నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. కానీ అందుకు తగ్గట్లుగా పనులు జరగట్లేదు. ఏదో తూతూ మంత్రంగా చేసి వదిలేస్తున్నారు. ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిధుల నుంచి పుష్కర ఘాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గర రూ.14 లక్షలతో ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఇందులో భాగంగా స్త్రీలు బట్టలు మార్చుకునేందుకు రెండు షెడ్లు, 36 బ్యాటరీ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాప్స్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తున్నారు. ఒకేసారి లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఇవి ఏ మాత్రం సరిపోవని కనీసం వెయ్యి బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్త్రీలు బట్టలు మార్చుకునేందుకు 100 గదులు నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. మరోవైపు పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం నదికి దగ్గరగా మరుగుదొడ్లు, మూత్ర శాలలు నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆ పనులు మొదలు పెట్టలేదు. 110 మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మించాల్సి ఉండగా భూసమస్య వల్ల పనులు లేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయినట్లుగా ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు చెబుతున్నారు.