హోమ్ ఐసోలేషన్ పేషెంట్లను పట్టించుకోవట్లే

హోమ్ ఐసోలేషన్ పేషెంట్లను పట్టించుకోవట్లే

హైదరాబాద్, వెలుగు: హోమ్ ఐసోలేషన్‌‌‌‌లో ఉంటున్న కరోనా పేషెంట్లకు ట్రీట్‌‌‌‌మెంట్ అందడం లేదు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేక, ఏదైనా ఇబ్బంది వస్తే డాక్టర్ల సలహా దొరక్క అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ కాల్ సెంటర్‌‌‌‌కు ఫోన్లు చేసినా కలవడం లేదని బాధితులు వాపోతున్నారు. చివరకు సోషల్ మీడియాలోనో, గూగుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనో వెతికి మెడిసిన్స్ వేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఆన్‌‌‌‌లైన్ వైద్యం వికటించి, పేషెంట్లు సీరియస్ కండీషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వెళ్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 21,864 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కానీ, ఇండ్లలో ఉన్నవారితో కలిపి దాదాపు లక్ష యాక్టివ్‌‌‌‌‌‌‌‌ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.  వీరిలో 7,433 మంది మాత్రమే హాస్పిటళ్లలో ఉన్నారు. హోమ్ ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటున్న వాళ్లకు ఒకట్రెండు రోజుల తర్వాత తలనొప్పి, మోషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విపరీతమైన అలసట, కళ్ల మంట, ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి సమస్యలొస్తున్నాయి. కొంతమందిలో ఛాతీ మంట, కడుపు నొప్పి వంటివి బాధిస్తున్నాయి. ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలో, ఏ మందులు వాడాలో తెల్వక పేషెంట్లు తిప్పలు పడుతున్నారు. 

జిల్లాల్లో పరిస్థితి ఘోరం.. 

ప్రభుత్వం ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్‌‌‌‌కు  ప్రస్తుతం రోజూ 3 వేల కాల్స్ వస్తున్నాయి. కానీ ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ అనే వస్తోందని బాధితులు వాపోతున్నారు. వేల సంఖ్యలో కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తుండడంతోనే లైన్ బిజీ ఉంటోందని సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్​చార్జి మన్మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు తెలిపారు. ఇక జిల్లాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్నవాళ్ల గోడు పట్టించుకునేటోళ్లే లేరు. మొత్తం హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐసోలేషన్ పీరియడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనీసం ఒక్కసారి కూడా తమకు ఫోన్లు రావడం లేదని బాధితులు చెబుతున్నారు. పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీల్లో సిబ్బంది టెస్టులు చేయడం, వ్యాక్సిన్ వేయడంతోనే అలసిపోతున్నారు. ఒక్కో పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ పరిధిలోనే వందల కేసులు ఉండడంతో, వాళ్లకు ఫోన్లు చేయడం సాధ్యం కాదని చెబుతున్నారు. జిల్లా వారీగా కాల్ సెంటర్లు పెట్టి, స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెంచడం లాంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కాల్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సుమారు 80 మంది షిఫ్ట్‌‌‌‌ల వారీగా పని చేస్తున్నారు. 

కరోనా కిట్లు ఇస్తలేరు... 

పాజిటివ్ వచ్చిన వాళ్లకు హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిట్లు ఇస్తున్నారు. కానీ, ఇవి అందరికీ అందడం లేదు. ర్యాపిడ్ టెస్టు రిజల్ట్ వచ్చే వరకు టెస్టింగ్ సెంటర్ వద్ద వెయిట్ చేసిన వారికి మాత్రమే కిట్ ఇస్తున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసుకునే వాళ్లకు, ర్యాపిడ్ రిజల్ట్ వచ్చే వరకు సెంటర్ వద్ద వెయిట్ చేయని వాళ్లకు కిట్లు ఇవ్వడం లేదు. రోజూ 10 వేలకుపైగా కేసులు వస్తే.. అందులో ఆరేడు వేల మందికే కిట్లు అందుతున్నట్టు సమాచారం. ఈ కిట్లలో పారాసిటమాల్, అజిత్రోమైసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విటమిన్ ట్యాబ్లెట్లు ఉంటాయి. కనీసం అవి ఎలా వాడాలో బాధితులకు చెప్పడం లేదు. ఒళ్లు నొప్పులు, డయేరియా, కళ్ల కలక, ఛాతిలో మంట వంటి లక్షణాలకు ట్యాబ్లెట్లు ఇవ్వడం లేదు. వీటికి ఏ మెడిసిన్ వాడాలో పేషెంట్లకు తెలియడం లేదు.