Waltheru Veeraya: సినిమా ఆలస్యం..థియేటర్లో ధ్వంసం

Waltheru Veeraya: సినిమా ఆలస్యం..థియేటర్లో ధ్వంసం

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఇవాళ థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ వద్ద చిరు ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. తెల్లవారుజామునుంచే థియేటర్లముందు పడిగాపులు కాశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, థియేటర్ యజమానులు తగిన చర్యలు చేపట్టారు. అయితే గుంటూరులోని పొన్నూరు థియేటర్లో జరిగిన ఒక ఘటన అభిమానుల్ని పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లింది. 

ఉదయం బెనిఫిట్ షో చూసేందుకు చిరు అభిమానులు శ్రీలక్ష్మీ థియేటర్ కి వెళ్లారు. సాంకేతిక లోపంతో సినిమా ప్రసారంలో అంతరాయం ఏర్పడింది. చాలాసేపు వేచిచూసినా థియేటర్ యజమానులు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఆగ్రహానికి గురైన అభిమానులు థియేటర్ అద్దాలు పగలగొట్టారు. దాంతో థియేటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.