- టెన్షన్ లో యాదాద్రి, సిద్దిపేట జిల్లాల ఫారెస్ట్ ఆఫీసర్లు
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో కనిపించిన పెద్ద పులి జాడ దొరుకతలేదు. ఫారెస్ట్డిపార్ట్మెంట్ను టెన్షన్ పెట్టిస్తోంది. ట్రాప్ కెమెరాకు చిక్కడంలేదు. మూడు రోజులుగా అది ఎక్కడ ఉందో..? ఎటువైపువెళ్లిందో తెలియక అటవీ అధికారులకు తల నొప్పిగా మారింది.
దత్తాయిపల్లి గుట్టలు, పెద్దకంచెలో పెద్ద పులి జాడ కోసం16 ట్రాప్ కెమెరాలకు పెట్టినా చిక్కకుండా పెద్ద పులి చిక్కలేదు. ఈనెల 28న ఆవు చంపి తలను విడిచి పెట్టి మొత్తం తినేసింది. కానీ దాని సమీపంలోని ట్రాప్కెమెరాకు చిక్కలేదు. మేకను ఎరగా వేసి బోను పెట్టినా చిక్కలేదు.
ఆ తర్వాత యాదాద్రి జిల్లా సరిహద్దు తుర్కపల్లి మండలంలోని తిర్మలాపూర్, కొండాపూర్వరకు పులి పాదముద్రలు కనిపించాయి. ఆ తర్వాత దొరకలేదు. దీంతో సరిహద్దు జిల్లా సిద్దిపేటలోకి వెళ్లిందని భావించారు. అక్కడి ఆఫీసర్లను సంప్రదించగా రాలేదని చెప్పినట్టు తెలిసింది. మూడు రోజులుగా దాని జాడ తెలియక యాదాద్రి జిల్లా ఫారెస్ట్స్టాఫ్ నాలుగు టీమ్స్పులి జాడ కనిపెట్టేందుకు గాలింపు చేపట్టాయి.
యాదాద్రి జిల్లాలో శ్రీనివాసపురం అడవి ఉండగా, సిద్దిపేటలో పీర్లపల్లి ఫారెస్ట్ ఉంది. యాదాద్రి జిల్లాలోని కొండాపూర్ వరకు కన్పించిన పులి పాదముద్రలు ఆ తర్వాత కన్పించ లేదు. దీంతో ఆ పులి ఏదైనా అడవిలోకి వెళ్లిందా.? అన్న అనుమానాలు వస్తున్నాయి. అడవిలోకి వెళ్తే పెద్దపులి సమస్య పరిష్కారమైనట్టే అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్భావిస్తోంది.
