" రామారావు ఆన్ డ్యూటీ " .. ఫ్యాన్స్కు కిక్ ఇచ్చే ట్రైలర్

" రామారావు ఆన్ డ్యూటీ " .. ఫ్యాన్స్కు కిక్ ఇచ్చే ట్రైలర్

రామారావు డ్యూటీ ఎక్కేశాడు.. ఇన్నాళ్లు ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా  చట్టం ప్రకారం న్యాయం కోసం డ్యూటీ చేసిన తాను ..ఇక నుంచి ధర్మం కోసం డ్యూటీ చేస్తానంటున్నాడు మాస్ మహారాజా రవితేజ. అతను ప్రధాన పాత్రలో  నటించిన యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ.  ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ధర్మం కోసం చట్టాన్ని పక్కన పెట్టి..డ్యూటీ చేసిన ఓ పోలీస్ ఆఫీసర్ కథే ఈ సినిమా అని తెలుస్తోంది. 

ఆపరేషన్ మాయంలో గల్లంతైంది వేరు వేరు ప్రాంతాలకు చెందిన కష్టజీవులు. తన తండ్రిని వెతకడంలో హెల్ప్ చేయమని  ఓ పాప అడగటం వంటి డైలాగులతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.  ఇందులో రవితేజ జనం కోసం నిలబడే నిజాయితీ గల ప్రభుత్వ అధికారిగా చూపించారు. అయితే ఇన్నాళ్లూ ఒక ప్రభుత్వాధికారిగా చట్ట ప్రకారం న్యాయం కోసం డ్యూటీ చేసిన నేను.... ఇక నుంచి రామారావుగా ధర్మం కోసం డ్యూటీ చేస్తానంటూ రవితేజ చెప్పిన డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ట్రైలర్ చూస్తుంటే..రవితేజ అభిమానులు కోరుకునే యాక్షన్ తో పాటు..థ్రిల్లర్ ఇందులో పుష్కలంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రవితేజ పోషించిన గత చిత్రాల్లోని పాత్రలకు భిన్నంగా ఈ పాత్ర ఉండబోతున్నట్లు సమాచారం. 

ఈ ట్రైలర్‌లో రవితేజ నటన, డైలాగ్స్‌ మాస్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. 1995లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రామారావు ఆన్ డ్యూటీ మూవీ తెరకెక్కింది. శరత్ మండవను దర్శకుడిగా పరిచయం చేస్తూ... SLV సినిమాస్, RT టీం వర్క్స్ పతాకాలపై  సుధాకర్ చెరుకూరి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సామ్‌ సీఎస్‌ సంగీతం అందించాడు. ఈ  సినిమాలో  హీరోయిన్లగా దివ్యాంశ కౌశి, రజిషా విజయన్‌  నటిస్తున్నారు. వీరిద్దరితో  రవితేజ లవ్ ట్రాక్ నడిపించన్నాడని తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత ఈ చిత్రంలో నటుడు వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. వీరితో పాటు  నాజర్, - సీనియర్ నటుడు, నరేష్, - పవిత్ర లోకేష్, - చైతన్య కృష్ణ, - తనికెళ్ల భరణి, - రాహుల్ రామకృష్ణ ,- ఈరోజుల్లో శ్రీ వంటి వారు పలు పాత్రలు పోషించారు.  జూలై 29న సినిమా విడుదలవనుంది.