బులవాయో: ఆరోసారి అండర్–19 వరల్డ్ కప్ టైటిల్‌ను గెలవడమే లక్ష్యంగా ఇండియా కుర్రాళ్లు రెడీ అయ్యారు. టోర్నీలో భాగంగా గురువారం గ్రూప్–బి తొలి మ్యాచ్‌లో అమెరికాతో తలపడనున్నారు. 1988లో ప్రారంభమైన ఈ టోర్నీలో 16 ఎడిషన్లలో ఇండియా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచింది. 2024 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన ఇండియా.. 2018, 2000, 2008, 2012, 2022లో ట్రోఫీ సాధించింది.
ఇక ప్రస్తుత టోర్నీలోనూ టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. వైభవ్ సూర్యవంశీ, కెప్టెన్ ఆయుష్ మాత్రే, విహాన్ మల్హోత్రా, ఆరోన్ జార్జ్, అభిగ్యాన్ కుండు కీలకం కానున్నారు. భిన్నమైన యాక్షన్ కలిసిన పేసర్ దీపేశ్ దేవేంద్రన్ ఎక్స్ ఫ్యాక్టర్ కావొచ్చు. ఎస్. అంబరీష్, కిషన్ సింగ్, హెనిల్ పటేల్ బంతితో ప్రభావం చూపించొచ్చు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అమెరికా ఇండియాను అడ్డుకుంటే అది సంచలనమే.
