క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం

క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ: ఇవాళ ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశంలో కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్ సీజన్ లో ఫాస్పేట్, పొటాష్ ఎరువులపై సబ్సిడీని కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాంతో గత ఏడాదితో పోల్చితే 50 శాతం సబ్సిడీ పెరిగింది. దేశీయంగా ఉత్పత్తి చేసే ఎరువులకు,  డీఏపీకి కూడా సబ్సిడీ వర్తిస్తుంది. ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధిని 2024 డిసెంబర్ వరకు కొనసాగిచేందుకు కేబినెట్ ఆమోదించింది. చీనాబ్ నదిపై 540 మెగావాట్ల క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆమోదం తెలిపింది. మావోయిస్టు ప్రభావిత  ప్రాంతాల్లో ఇంటర్నెట్ స్పీడ్ పెంచేలా 2జీ సేవలను 4జీకి  మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 2 వేల 426 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని వార్తల కోసం..

రాష్ట్ర కేబినెట్ లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలె

హాలీవుడ్ మూవీలో ధనుష్ ఫస్ట్ లుక్ రివీల్