వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను ఆదుకోవాలి : ప్రియాంక గాంధీ

 వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను ఆదుకోవాలి : ప్రియాంక గాంధీ

 అస్సాంలో భారీ వర్షాలు, వరదలపై స్పందించారు కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ. వరదల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. సహాయక చర్యల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. వరదల పరిస్థితుల కారణంగా లక్షల మంది  జనం పునరావాస కేంద్రాల్లో నివసిస్తున్నారని తెలిపారు ప్రియాంకగాంధీ. వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరారు  ప్రియాంకగాంధీ.

మరోవైపు  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  మణిపూర్ రాష్ట్ర  పర్యటన ఖరారైంది.  రేపు రాహుల్ మణిపూర్ కు వస్తారన్నారు ఆరాష్ట్ర అధ్యక్షులు కైశం మేఘచంద్ర. ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో రాహుల్.. ఇంఫాల్ కు వస్తారన్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చురాచందూర్ జిల్లాకు వెళ్తారన్నారు. ఆతర్వాత మణిపూర్ లోని శాంతి భద్రతలపై గవర్నర్ ను కలుస్తారని తెలిపారు మేఘచంద్ర.