మళ్లీ తెరపైకి వరంగల్‌‌‌‌‌‌‌‌ అండర్‌‌‌‌‌‌‌‌ డ్రైనేజీ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌

మళ్లీ తెరపైకి వరంగల్‌‌‌‌‌‌‌‌ అండర్‌‌‌‌‌‌‌‌  డ్రైనేజీ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌
  •     1995లోనే ప్రపోజల్ 1996లో డీపీఆర్‌‌‌‌‌‌‌‌
  •     ఇదే అంశాన్ని ఆయుధంగా వాడుకున్న కేసీఆర్‍
  •     2015లో వరంగల్‍  పర్యటనలో హడావుడి
  •     పదేండ్లుగా పట్టించుకోని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌  సర్కార్‌‌‌‌‌‌‌‌
  •     సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రకటనతో గ్రేటర్  ప్రజల్లో చిగురిస్తున్న ఆశలు

వరంగల్‍, వెలుగు: హైదరాబాద్‍  తర్వాత అతిపెద్ద నగరమైన ఓరుగల్లులో అండర్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌  డ్రైనేజీ ఏర్పాటు అంశం మరోసారి తెరమీదకొచ్చింది. వరంగల్‌‌‌‌‌‌‌‌లో అండర్ గ్రౌండ్  డ్రైనేజీ హామీ నాటి సమైక్య రాష్ట్రంతో పాటు కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు ఏండ్ల తరబడి ఎన్నికల హామీగా పనికొచ్చింది. తప్పితే పనులను చేయించే విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో గ్రేటర్‌‌‌‌‌‌‌‌ వరంగల్‍ ప్రజలు ఏటా వానాకాలంలో వరదలతో తిప్పలు పడుతున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌  సర్కార్​ వరంగల్‌‌‌‌‌‌‌‌  అండర్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌  డ్రైనేజీపై స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టింది. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఇటీవల వరంగల్‌‌‌‌‌‌‌‌ పర్యటించిన టైంలో అండర్‌‌‌‌‌‌‌‌  గ్రౌండ్‌‌‌‌‌‌‌‌  డ్రైనేజీ నిర్మాణానికి ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌  పంపాలని ఆఫీసర్లను ఆదేశించడంతో ఈ పనులపై ప్రజల్లో ఆశలు చిగురించాయి.

రాజకీయంగా వాడుకున్న కేసీఆర్‌‌‌‌‌‌‌‌

ఓరుగల్లులో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ అంశాన్ని కేసీఆర్‌‌‌‌‌‌‌‌ రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకున్నారు. 2001 తెలంగాణ ఏర్పాటు ఉద్యమం మొదలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 2014లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి వచ్చే వరకు సుమారు 22 ఏండ్లుగా ఎన్నికల హామీగా వాడుకున్నారు. రాష్ట్రం వచ్చాక వరంగల్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌లో 42 గ్రామాలు విలీనం కావడం, జనాభా, ఏరియా విస్తీర్ణం, సిటీలో ఇండ్ల సంఖ్య పెరగడంతో అప్పటివరకు కార్పొరేషన్‍గా ఉన్న వరంగల్‌‌‌‌‌‌‌‌ గ్రేటర్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌గా మారింది.

కేసీఆర్‌‌‌‌‌‌‌‌ సీఎం అయ్యాక 2015లో వరంగల్‌‌‌‌‌‌‌‌ పర్యటనకు వచ్చారు. వరంగల్‍ సిటీలో అండర్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ డ్రైనేజీ నిర్మిస్తామని ప్రకటించారు. అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్‍ అమ్రపాలి ఈజీఐఎస్‌‌‌‌‌‌‌‌ సంస్థతో కలిసి డీపీఆర్‌‌‌‌‌‌‌‌ తయారు చేసి కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు పంపించారు. కానీ పనులు మాత్రం పేపర్‌‌‌‌‌‌‌‌పైనే ఆగిపోయాయి. ఆ తర్వాత సీఎంగా కేసీఆర్‌‌‌‌‌‌‌‌, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి హోదాలో కేటీఆర్‍ పదుల సార్లు వరంగల్‌‌‌‌‌‌‌‌ సిటీకి వచ్చారు. కానీ అండర్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ డ్రైనేజీ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను మాత్రం పట్టించుకోలేదు. 

సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి హామీతో ఆశలు..

ఓరుగల్లువాసులకు ఏండ్ల తరబడి కలగా మారిన భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు హామీలు ఏండ్లుగా డీపీఆర్‌‌‌‌‌‌‌‌ల స్థాయిలోనే ఆగిపోయాయి. ఆఫీసర్లు గతంలో తయారు చేసిన డీపీఆర్‌‌‌‌‌‌‌‌ లెక్కల ప్రకారం 42 విలీన గ్రామాలతో కలిపి గ్రేటర్‌‌‌‌‌‌‌‌ విస్తీర్ణం 407.71 స్వ్కేర్‌‌‌‌‌‌‌‌ కిలోమీటర్లుగా ఉంది. నగరంలో 2.35 లక్షల ఇండ్లు ఉండగా, జనాభా 11 లక్షలకు చేరింది. మొత్తంగా 92 నోటిఫైడ్‍, 91 నాన్‌‌‌‌‌‌‌‌ నోటిఫైడ్‌‌‌‌‌‌‌‌ స్లమ్‌‌‌‌‌‌‌‌ ఏరియాలతో గ్రేటర్‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌ విస్తరించింది.

అప్పట్లో ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను కేంద్ర ప్రభుత్వ అమృత్‍ 2.0లో చేర్చుతున్నట్లు వార్తలొచ్చాయి. అయితే అప్పటికే కేసీఆర్‍ ప్రభుత్వం స్మార్ట్‌‌‌‌‌‌‌‌ సిటీ స్కీంలో తన వాటాగా సగం నిధులు ఇవ్వకపోవడంతో దానికి బ్రేక్‌‌‌‌‌‌‌‌ పడినట్లైంది. ఇన్నాళ్లూ గ్రేటర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు అడపదడపా మాట్లాడటం తప్పితే అండర్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ డ్రైనేజీ అంశాన్ని అందరూ మర్చిపోయారు. మహానగరంలో వరద సమస్యలకు తోడు అభివృద్ధిపరంగానూ భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు తప్పనిసరిగా మారింది.

ఈ క్రమంలో వరంగల్‌‌‌‌‌‌‌‌ పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి వరంగల్‍ను రెండో రాజధానిగా మార్చుతామని చెప్పారు. ఏప్రిల్‍ 24న మడికొండ సభలో అండర్‍ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ టాపిక్‍ తీయడంతో పాటు, మే 7న గ్రేటర్ వరంగల్‌‌‌‌‌‌‌‌లో జరిగిన కార్నర్‍ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో అండర్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‍ డ్రైనేజీ ఏర్పాటుకు అవసరమైన ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌ పంపాలని ఆఫీసర్లను ఆదేశించారు. దీంతో అండర్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

1995లోనే అడుగులు..

వరంగల్‍ నగరం 1994లో స్పెషల్‌‌‌‌‌‌‌‌  గ్రేడ్‌‌‌‌‌‌‌‌  మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌గా అప్‍గ్రేడ్‌‌‌‌‌‌‌‌  అయింది. ఈ క్రమంలోనే అండర్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ డ్రైనేజీ అంశం 1995లో తెరమీదకొచ్చింది. తెలంగాణకు చెందిన అప్పటి కేంద్రమంత్రి జైపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ నిర్మాణంపై  సానుకూలంగా స్పందించారు. దీంతో 1996లో రూ.110 కోట్ల అంచనా బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో డీపీఆర్‌‌‌‌‌‌‌‌ తయారు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించారు.