ఈ నెల 10న 'ది వారియర్' ప్రీ రిలీజ్ ఈవెంట్

ఈ నెల 10న 'ది వారియర్' ప్రీ రిలీజ్ ఈవెంట్

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం 'ది వారియర్' మూవీలో నటిస్తున్నాడు. లింగుసామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా అలరించనుంది. ఇందులో విలన్ గా  ఆది పినిశెట్టి నటించగా, కీలకమైన పాత్రలో నదియా కనిపించనుంది. ఈ నెల 14వ తేదీన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ జోరు పెంచారు.

ఈ మేరకు తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ముహుర్తం ఖరారు చేశారు. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ - జేఆర్సీ కన్వెన్షన్స్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక జరుగనుంది. దీనికి సంబంధించిన ఒ పోస్టర్ ను విడుదల చేశారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానకి సంగీతాన్ని సమకూర్చాడు.