ప్రపంచంలో డీఎన్ఏ బేస్డ్ తొలి టీకా జైకోవ్-డి

ప్రపంచంలో డీఎన్ఏ బేస్డ్ తొలి టీకా జైకోవ్-డి
  • జైకోవ్​డీ వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోటి డోసులు కొంటం
  • ఒక్కొక్కటి రూ.265 చొప్పున కొనేందుకు కేంద్రం ఆర్డర్
  • సూది లేకుండా జెట్ అప్లికేటర్ ద్వారా వేస్తరు

న్యూఢిల్లీ: గుజరాత్​కు చెందిన ఫార్మా కంపెనీ జైడస్​క్యాడిలా తయారు చేసిన ‘జైకోవ్​డీ’ కరోనా వ్యాక్సిన్​ మరికొద్ది రోజుల్లో దేశంలో అందుబాటులోకి రాబోతోంది. టీకా రేటును తగ్గించేందుకు కంపెనీ ఓకే చెప్పడంతో కోటి డోసులను కేంద్రం ఆర్డర్​ చేసింది. ఒక్కో డోసును రూ.265కు కొంటోంది. సూది లేకుండా(నీడిల్​ఫ్రీ) జెట్​అప్లికేటర్​ద్వారా డైరెక్ట్​గా ఇచ్చే ఈ వ్యాక్సిన్​ను 12 ఏండ్ల పైబడిన వారికి వేసేందుకు ఈ ఆగస్టులోనే కేంద్రం అనుమతిచ్చింది. ప్రపంచంలో కరోనా కట్టడికి తయారు చేసిన తొలి డీఎన్​ఏ బేస్డ్​ టీకా ఇదే. ఈ టీకాను మూడు డోసుల్లో 28 రోజులకోసారి ఇవ్వాలని జైడస్‌‌‌‌ క్యాడిలా కంపెనీ ఇప్పటికే చెప్పింది. మూడు డోసులకు కలిపి తొలుత రూ.1,900గా ధరను కంపెనీ ఫిక్స్​ చేసింది. ప్రభుత్వం చర్చలు జరిపాక రేటును తగ్గించింది. 
వేరే రోగాలున్నోళ్లకు..
ఇతర రోగాలు ఉన్న వాళ్లకు జైకోవ్​డీ టీకా ఇచ్చేందుకు నేషనల్​టెక్నికల్​అడ్వైజరీ గ్రూప్​ ఆన్​ ఇమ్యునైజేషన్(ఎన్​టీఏజీఐ) నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. టీకా డ్రైవ్​లో ఈ వ్యాక్సిన్​ను వాడేందుకు కావాల్సిన ప్రొటోకాల్, ఫ్రేమ్​వర్క్​ను ఎన్​టీఏజీఐ రెడీ చేస్తోంది. ఎన్​టీఏజీఐ రికమండేషన్​ కోసం ప్రభుత్వం వేచి చూస్తోంది. జైకోవ్​డీ టీకాను జెట్​ఇంజెక్టర్​ ద్వారా ఇస్తారు. ఒక్కో ఇంజెక్టర్‌‌‌‌తో 20వేల మందికి టీకా వేయొచ్చు. టీకాలోని మందును జెట్​అప్లికేటర్​ శరీరంలోకి పంపిస్తుంది.