ప్రపంచంలోనే తొలిసారిగా రెండు చేతులు, ఫేస్ ట్రాన్స్‌ప్లాంట్

ప్రపంచంలోనే తొలిసారిగా రెండు చేతులు, ఫేస్ ట్రాన్స్‌ప్లాంట్

సుమారు 23 గంటల పాటు శ్రమించిన 96 మంది వైద్య సిబ్బంది

ప్రపంచంలోనే తొలిసారిగా ఒక వ్యక్తికి రెండు చేతులు, ఫేస్ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. ఆక్సిడెంట్‌లో తీవ్ర గాయాలై రెండు నెలలకు పైగా కోమాలో ఉన్న వ్యక్తికి సర్జరీ చేసి ఈ రికార్డు సృష్టించారు. న్యూజెర్సీకి చెందిన 22 ఏళ్ల జో డిమియో జూలై 2018లో నైట్ షిఫ్ట్ డ్యూటీ చేసి ఇంటికి వస్తున్నాడు. ఆ సమయంలో కారును ఆయనే డ్రైవింగ్ చేస్తున్నాడు. అయితే రాత్రంతా నిద్రలేకపోవడంతో.. డిమియో నిద్రలోకి జారుకున్నాడు. దాంతో కారు అదుపుతప్పి బోల్తా పడింది. వెంటనే కారులో మంటలు అంటుకున్నాయి. అటుగా వెళ్తున్న ఒక వాహనదారుడు వెంటనే అప్రమత్తమై.. డిమియోను కారు నుంచి బయటకు తీశాడు. కానీ అప్పటికే డిమియోకు 80 శాతానికి పైగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో డిమియో ముఖం, చేతులు, పెదవులు, కనురెప్పలు పూర్తిగా పాడైపోయాయి.

ఆ గాయాలతో ఆస్పత్రిలో చేరిన డిమియో.. నాలుగు నెలలు బర్న్ యూనిట్లో ఉన్నాడు. అక్కడ పలుసార్లు బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ జరిగిన తర్వాత నార్మల్ వార్డులోకి మార్చబడ్డాడు. ఆ వార్డులో కూడా డిమియో.. దాదాపు రెండున్నర నెలలు కోమాలో ఉన్నాడు. ఆ తర్వాత మెల్లగా కోలుకున్న డిమియోకు ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. అందుకోసం ఎన్‌వైయు లాంగోన్‌ ఆస్పత్రిలో ఫేస్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ ఎడ్వర్డో రోడ్రిగెజ్ నేతృత్వంలో 96 మంది వైద్య సిబ్బంది.. సుమారు 23 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. ఈ ఆపరేషన్ ఆగస్టు 12, 2020న జరిగింది.

ఈ ప్రమాదం నుంచి కోలుకున్న డిమియో.. ‘ప్రస్తుతం నేను అనుభవిస్తున్న జీవితం.. దేవుడు నాకిచ్చిన రెండో అవకాశం. నేను అసలు బతుకుతాను అనుకోలేదు. నాకు సర్జరీ చేసిన డాక్టర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు’ అని అన్నాడు.

For More News..

రేషన్ షాపుల్లోనే ఆధార్-ఫోన్ నెంబర్ లింకింగ్

సీఎం కార్యక్రమంలో బిర్యానీ తిని 145 మందికి అస్వస్థత

రైతులకు సపోర్టుగా సెలబ్రిటీల ట్వీట్లు.. తెలుసుకొని మాట్లాడాలని కేంద్రం సీరియస్