యునైటెడ్ స్టేట్స్ లోని అతి పెద్ద బ్యాంక్ పతనం అయింది.. కారణాలు ఏంటంటే..

యునైటెడ్ స్టేట్స్ లోని అతి పెద్ద బ్యాంక్ పతనం అయింది.. కారణాలు ఏంటంటే..

యునైటెడ్ స్టేట్స్ లోని అతి పెద్ద బ్యాంక్ కుప్పకూలింది. ఎర్లీ స్టేజ్ స్టార్టప్‌‌‌‌లకు ఎక్కువగా అప్పులిచ్చే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్‌‌‌‌వీబీ) యూఎస్‌‌‌‌లో అతిపెద్ద 15  వ బ్యాంక్‌‌‌‌.  ఎస్‌‌‌‌వీబీ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌‌‌‌కు సబ్సిడరీ అయిన ఈ బ్యాంక్,  గత కొంత కాలంగా లిక్విడిటీని పెంచుకోవడానికి తంటాలు పడుతోంది.   ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడంతో , ప్రైవేట్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లను ఆకర్షించలేక  ఇబ్బంది పడుతోంది. ఫండ్స్ కోసం మొత్తం బ్యాంక్‌‌నే ఎస్‌‌‌‌వీబీ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌‌‌‌ అమ్మకానికి పెట్టిందని వార్తలొస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ ఆ బ్యాంకు ఆస్తులను జప్తు చేయడంతో పాటు, బ్యాంకు పేరెంట్ కంపెనీ ఎస్ వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ షేరు దాదాపు 60 శాతం పడిపోయింది.

ఎస్‌‌‌‌వీబీ సంక్షోభం ఏంటి?..

ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడంతో  ఎస్‌‌‌‌వీబీ సంక్షోభం  స్టార్టయ్యిందని చెప్పాలి. ఫిక్స్డ్‌‌‌‌ రేట్ అవైల్‌‌‌‌బుల్‌‌‌‌ ఫర్ సేల్‌‌‌‌ (ఏఎఫ్ఎస్‌‌‌‌) బాండ్లలో 21 బిలియన్ డాలర్లను బ్యాంక్‌‌‌‌  ఇన్వెస్ట్ చేసింది. ఏఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ బాండ్లను లాంగ్‌‌‌‌టర్మ్‌‌‌‌ కోసం ఇన్వెస్ట్ చేస్తారు. ఫెడ్ రేట్లు పెంచినా,  ఈ బాండ్లు ఆఫర్ చేసే రిటర్న్ మారదు.   ఏఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ బాండ్లయిన 3.6 ఏళ్ల కాలపరిమితి గల  యూఎస్ ట్రెజరీ, ఏజెన్సీ సెక్యూరిటీలలో 21 బిలియన్ డాలర్లు ఎస్‌‌‌‌వీబీ పెట్టింది. ఈ బాండ్లు 1.79 శాతం రిటర్న్‌‌‌‌ను ఆఫర్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాయి. కానీ, ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడంతో ఈ ట్రెజరీ బాండ్లు ప్రస్తుతం 4.71 శాతం రిటర్న్‌‌‌‌ను ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంక్ తన బాండ్ పోర్టుఫోలియోను మూడన్నరేళ్ల వరకు హోల్డ్ చేసి 1.79 శాతం రిటర్న్‌‌‌‌ పొందొచ్చు. లేదా తన బాండ్లను లాస్‌‌‌‌లోనైనా అమ్మేసి మళ్లీ షార్ట్ టెర్మ్‌‌‌‌ బాండ్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎస్‌‌‌‌వీబీ ఈ  రెండో ఆప్షన్‌‌‌‌ను ఎంచుకోవడానికి రెడీ అయ్యింది. సుమారు 1.8 బిలియన్ డాలర్ల లాస్‌‌‌‌ (ట్యాక్స్ తర్వాత) తో తన  ఏఎఫ్‌‌‌‌ఎస్ బాండ్లను అమ్మేసింది.  కంపెనీకి 2021 లో వచ్చిన మొత్తం ఆదాయం 1.5 బిలియన్ డాలర్ల కంటే ఈ లాస్ ఎక్కువ. ఇప్పుడు వచ్చిన లాస్‌‌‌‌ను కవర్‌‌‌‌‌‌‌‌ చేయడానికి మరో 2.3 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను అమ్మాలని ఎస్‌‌‌‌వీబీ చూస్తోంది.  కొత్తగా షేర్లను ఇష్యూ చేయడం ద్వారా ఈ ఫండ్స్ సేకరించనుంది. బ్యాంక్‌‌‌‌  మొత్తం మార్కెట్  క్యాప్‌‌‌‌లో ఇది 30 శాతానికి సమానం. ఎస్‌‌‌‌వీబీ షేర్లు క్రాష్ అవ్వడానికి ఇదొక కారణం. 

ముంచిన టెక్‌‌‌‌ క్రైసిస్‌‌‌‌..

టెక్ కంపెనీలకు, ఎర్లీ స్టేజ్ స్టార్టప్‌‌‌‌లకు ఎక్కువగా అప్పులిచ్చే ఎస్‌‌‌‌వీబీపై టెక్ సంక్షోభ ప్రభావం తీవ్రంగా పడింది. ఫండ్స్‌‌‌‌ను సేకరించడంలో ఇబ్బందులు పడుతుండడంతో ఈ బ్యాంకులోని తమ డిపాజిట్లను  స్టార్టప్‌‌‌‌లు పెద్ద మొత్తంలో తీసేశాయి. ఐపీఓలు తగ్గడంతో  ఎస్‌‌‌‌వీబీలో వెంచర్ క్యాపిటలిస్టుల డిపాజిట్లూ పడిపోయాయి.  2021 లో బ్యాంక్‌‌‌‌ డిపాజిట్లు  189.20 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. అంతకు ముందు ఏడాది ఇవి 61.70 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. కానీ, 2022 లో టెక్ సంక్షోభం నెలకొనడంతో బ్యాంక్ డిపాజిట్లు పడిపోవడం స్టార్టయ్యాయి. ఎస్‌‌‌‌వీబీ లోన్‌‌‌‌ గ్రోత్‌‌‌‌కు తగ్గట్టు బ్యాంక్ దగ్గర డిపాజిట్లు లేవు. దీంతో లిక్విడిటీ పెంచుకోవడానికి  బ్యాంక్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే లాస్‌‌‌‌లోనైనా తన ఏఎఫ్‌‌‌‌ఎస్ బాండ్లను అమ్మేసింది. తమ దగ్గర 180 బిలియన్ డాలర్ల లిక్విడిటీ అందుబాటులో ఉందని, 169 బిలియన్ డాలర్ల డిపాజిట్లను కవర్ చేస్తుందని  ఎస్‌‌‌‌వీబీ చెబుతోంది.

షేరు ఒక్క రోజే 66% క్రాష్​..

ఎస్‌‌వీబీ  షేర్లు శుక్రవారం సెషన్‌‌లో  66 శాతం మేర పతనమై 106 డాలర్ల కు పడ్డాయి. బ్యాంక్ షేర్లు వరుసగా రెండో సెషన్‌‌లో కూడా 50 శాతానికి పైగా పడడంతో ఈ షేరులో ట్రేడింగ్ ఆపేశారు. ఎస్‌‌వీబీ షేర్లు గురువారం సెషన్‌‌లో 53 శాతం నష్టపోయి  125 డాలర్ల దగ్గర ముగిశాయి. 

బ్యాంకుల బ్యాలెన్స్‌‌ షీట్‌‌లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ప్రాధాన్యాన్ని యూఎస్ బ్యాంకులు, మార్కెట్స్‌‌, ఎనలిస్టుల, ఇన్వెస్టర్లు తక్కువగా అంచనావేశారు. ఒక ఏడాది కాలంలోనే  వడ్డీ రేట్లు జీరో నుంచి 5 శాతానికి పెరిగాయంటే, ఎక్కడో  పెద్ద యాక్సిడెంట్ జరగనుందని అనిపిస్తోంది. ‑ ఉదయ్ కోటక్,  కోటక్ బ్యాంక్ ఎండీ