
ఆఫీస్ అంటే వర్క్ ఒక్కటే కాదు బోలెడంత ఫన్ కూడా. అయితే వర్క్‌ప్లేస్‌లో ఆ ఫన్ మాకొద్దంటున్నారు యంగ్ ఎంప్లాయిస్. కానీ, ఆఫీసులో రెస్పెక్ట్ లేకపోతే మాత్రం పనిచేయలేం అంటున్నారు. 21నుంచి 31 యేళ్ల మధ్య వయసున్న ఉద్యోగులంతా వర్క్‌ప్లేస్‌లో ఫన్ కన్నా రెస్పెక్ట్నే ఎక్కువ కోరుకుంటున్నారట. ఈ విషయమే రీసెంట్గా యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరీ ‘నోవాక్ లీడర్షిప్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్టడీ’లో తేలింది. ఈ స్టడీలో 18 రంగాలకి చెందిన 21 నుంచి 31 ఏళ్ల మధ్య వయసు వాళ్లు పార్టిసిపేట్ చేశారు. వాళ్లలో నూటికి తొంభై తొమ్మిది మంది వర్క్‌ప్లేస్‌లో గౌరవాన్నే కోరుకుంటున్నామన్నారు. ఆఫీసులో కో– ఎంప్లాయిస్, బాస్‌లు మమ్మల్ని పిలిచే విధానం.. మాతో మాట్లాడే పద్ధతి బాగాలేకపోతే ఎంత పెద్ద కంపెనీ అయినా పనిచేయలేం అని చెప్పారు వీళ్లు.