
చందుర్తి, వెలుగు: చందుర్తి మండల కేంద్ర శివారులోని దీక్షిత ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో శనివారం రాత్రి దొంగతనం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... మండల కేంద్రం శివారులోని ఏజెన్సీలో సీసీ కెమెరాలు వైర్లు కట్ చేసి, కరెంట్ ఫ్యూజ్ తొలగించి లోపలికి దూరాడు.
ఆఫీస్ గొల్లాన్ని ఇనుపరాడ్‌తో పగలగొట్టి రూ. 7 వేల నగదు, రసీదు బుక్కులను ఎత్తుకెళ్లాడు. గ్యాస్ ఆఫీస్‌ను ఎస్‌ఐ రమేశ్ పరిశీలించారు. కాగా ఐదు రోజుల కింద మరిగడ్డ హైస్కూల్‌లోనూ చోరీ జరగగా.. విషయం బయటకు రాలేదు. గ్యాస్ ఏజెన్సీలో చోరీతో స్కూల్‌లో జరిగిన దొంగతనం బయటకు వచ్చింది.